ఐపీఎల్‌లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్ కెరీర్‌లో కెప్టెన్‌గా ధోనీకి ఇదే చివరి మ్యాచ్. ఎందుకంటే ప్లే ఆఫ్స్ చేరడంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ విఫలమైంది. దీంతో లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటి ముఖం పట్టింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రంగా మిగలనుంది. ఈ మ్యాచ్ గురించి ఎన్టీవీ స్పెషల్ లైవ్ విశ్లేషణ గురించి తెలుసుకోవాలంటే…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను ఆ జట్టు సజీవంగా ఉంచుకుంది. ఆర్సీబీ విజయంతో హైదరాబాద్, పంజాబ్ జట్లు మాత్రం ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఈ రెండు జట్లు 22న తమ చివరి మ్యాచ్‌లో నామమాత్రంగా తలపడనున్నాయి. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విధించిన 169 పరుగుల…
ముంబైలోని వాంఖడే స్టేడియంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 5 కోల్పోయి 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (62) అర్ధసెంచరీతో రాణించాడు. శుభమన్‌గిల్(1), సాహా (31), వేడ్ (16), డేవిడ్ మిల్లర్ (34), తెవాటియా (2), రషీద్ ఖాన్ (19) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ 2 వికెట్లు సాధించగా.. మాక్స్‌వెల్, హసరంగ తలో…
ఐపీఎల్ 2022 సీజన్ తుది అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ప్లే ఆఫ్స్‌లో మూడు స్థానాల గురించి క్లారిటీ రాగా.. మరో స్థానం కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ…
బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ రెచ్చిపోయాడు. కేకేఆర్ బౌలింగ్‌ను చీల్చి చెండాడి భారీ సెంచరీ చేశాడు. బౌండరీల ద్వారానే డికాక్ 100 పరుగులు పిండుకున్నాడు. మొత్తం 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో డికాక్ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఐపీఎల్‌లో వ్యక్తిగత స్కోరు విషయంలో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో డికాక్ మూడో…
1. నేడు ఐపీఎల్ సీజన్ 2022లో భాగంగా బెంగళూరు జట్టుతో గుజరాత్ జట్టు తలపడనుంది. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియం దేదిక ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2. తెలంగాణలో నేడు ఆటోలు, క్యాబ్‌లు బంద్. వెహికల్ చట్టం 2019ను నిలిపివేయాలంటూ డ్రైవర్స్ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు బంద్ నిర్వహించనున్నారు. 3. నేడు ఆటోలు, క్యాబ్‌ల బంద్ దృష్ట్యా.. అర్థరాత్రి నుంచి ప్రత్యేక బస్సలను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. ప్రయాణికులకు…
ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లపాటు వికెట్ పడకుండా ఆడి 210 పరుగులు చేశారు. ఓపెనర్లు డికాక్(70 బంతుల్లో 140 నాటౌట్), కేఎల్ రాహుల్(51 బంతుల్లో 68 నాటౌట్) వీర విహారం చేశారు. అంతేకాకుండా వీళ్లిద్దరూ ఐపీఎల్‌లోనే రికార్డు స్థాయిలో ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బెయిర్‌స్టో, వార్నర్ (185 పరుగులు) పేరిట ఉన్న ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్…
ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌పై సన్‌రైజర్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 3 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఖరి మ్యాచ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్రకటించింది. Matthew…
కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. సెమస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో మెరుపులు మెరిపించారు. ముంబై ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు సన్ రైజర్స్ బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు సాధించారు. ఫలితంగా ముంబై ముందు 194 పరుగుల భారీ టార్గెట్ పెట్టారు. సన్ రైజర్స్ బ్యాటర్లలో ప్రియంగార్గ్, త్రిపాఠి, నికోలస్…
మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆసక్తికరపోరు జరుగనుంది. హైదరాబాద్ తన సెమిస్ ఆశలను పదిలంగా ఉంచుకోవాలంటే తప్పనిసరిగా ముంబైపై విజయం సాధించాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఘోరంగా విఫలం అవుతోంది. ఈ రెండు జట్ల మధ్య వాంఖడే స్టేడియం, ముంబై వేదికగా మ్యాచ్ జరుగబోతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో…