ప్రస్తుత రోజుల్లో చిన్న స్మార్ట్‌ఫోన్ దిరికితేనే.. జేబులో వేసుకుని పోతున్నారు జనాలు. కాస్త కాస్ట్‌లీ ఫోన్ దొరికితే ఊరుకుంటారా?.. గుట్టుచప్పుడు కాకుండా సైడ్ చేస్తారు. అందులోనూ ఐఫోన్ దొరికే.. మూడో కంటికి కూడా తెలియకుండా ఇంటికి తీసుకెళుతారు. అయితే అందరూ ఇలా ఉండరు. నూటికో, కోటికో ఒక్కరు మనసున్న మహారాజు కూడా ఉంటాడు. అందులో ఒకడే ఆంధ్రకు చెందిన ఆటో డ్రైవర్ స్వామి. తనకు కాస్ట్‌లీ ఐఫోన్ దొరికితే తిరిగిచ్చేశాడు. ప్రస్తుతం స్వామి పేరు సోషల్ మీడియాలో…
సాధారణంగా పరీక్షలో ఫెయిల్ అయ్యాను అన్న భయంతోనో, జాబ్ రాలేదు అన్న దిగులుతోనో, లేదంటే బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ఉచ్చులో పడి యువత ఆత్మహత్యలు చేసుకోడం చూస్తుంటాం. కానీ ఈ ఘటన మాత్రం బాధ పడాలో, ఓదార్చాలో తెలియని పరిస్థితి. తల్లిదండ్రులు ఖరీదైన ఐ ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురై జీవితాన్నే ఫణంగా పెట్టాడు. మూర్ఖంగా ప్రవర్తించి అత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. కేవలం ఓ ఐ ఫోన్ కోసం పాతికేళ్లు పెంచి పెద్ద చేసిన…
ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.. విశాఖపట్నంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుడు సాయి మారుతి తండ్రి చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వచ్చాడు.
సహరిద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తూ.. బ్లాకౌట్‌లు ప్రకటిస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఇండియన్ ఆర్మీ.. అయితే, ఈ సమయంలో మీ ఫోనే.. మీకు శ్రీరామ రక్షగా నిలవబోతోంది.. Androidతో పాటు iPhoneలలో అత్యవసర హెచ్చరికలను జారీ చేస్తోంది.. ఈ అత్యవసర హెచ్చరికలు జారీ చేసేందుకు ప్రత్యేక నెట్‌వర్క్ ఛానెల్‌ని ఉపయోగిస్తారు.. నెట్‌వర్క్‌లు రద్దీగా ఉన్నప్పుడు కూడా అవి మీ ఫోన్‌ను చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. మనం చేయాల్సిందల్లా.. మన ఫోన్‌లో సెట్టింగ్‌లు కాస్తా మార్చుకుని.. ఆ…
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ కు తరలించాలని యోచిస్తోంది.భారత్‌లో ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్‌లో తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధ చేస్తోంది. తాజాగా ఈ అంశాలపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు.
iPhone: ఇటీవల యువత తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటామని ఓ విధంగా పేరెంట్స్‌ని బ్లాక్‌మెయిల్ చేసి, తమకు కావాల్సినవి సాధించుకుంటున్నారు. పిల్లల కోరికల్ని తీర్చేందుకు తల్లిదండ్రులు నలిగిపోవాల్సి వస్తోంది. తాజాగా, ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఐఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యాయత్నాన్నికి పాల్పడింది. ఈ ఘటన బీహార్‌లోని ముంగేర్‌లో జరిగింది.
Whatsapp Update: వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా iOS యూజర్ల కోసం ఒక కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు మరింత సులభంగా కాల్స్ చేయగలుగుతారు. ఇప్పటివరకు కాంటాక్ట్ లిస్టులో లేని నంబర్లకు కాల్ చేయడం కష్టం. కానీ. ఈ కొత్త ఫీచర్‌తో ఇది మరింత సులభం కానుంది. వాట్సాప్ కొత్త అప్‌డేట్‌లో భాగంగా, కాల్స్ ట్యాబ్‌లో…
ఓలా, ఉబర్, ర్యాపిడో ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో ప్రయాణం ఈజీ అయ్యింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఉన్నచోటుకే నిమిషాల్లోనే వెహికల్ వచ్చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఆఫీస్ లకు వెళ్లే వారు, అర్జెంటుగా బయటికి వెళ్లాలనుకునే వారు కార్, బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఇటీవల ఓలా, ఉబర్ యూజర్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫోన్ రకాన్ని బట్టి, ఛార్జింగ్ పర్సంటేజ్ ను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆందోళన…
తమిళనాడులోని అరుల్మిగు కంద స్వామి ఆలయంలో ఒక భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు హుండీ (విరాళం పెట్టె)లో పడింది. దీంతో నిర్వాహకులు ఇది ఆలయ ఆస్తిగా ప్రకటించారు. హుండీలో ఏ వస్తువు పడితే అది దేవుడి సొత్తుగా పరిగణిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి నెత్తికి చేతులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఫోన్ తిరిగి రాకపోవడంతో ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
iPhones: భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ల ఎగుమతులు పెరిగాయి. ఆరు నెలల్లో మూడో వంతు పెరిగాయి. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించడానికి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని సూచిస్తోంది. భారత్ నుంచి ఏకంగా 6 బిలియన్ డాలర్ల ఐఫోన్ ఎగుమతులు జరిగినట్లు తెలిసింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడో వంతు పెరుగుదల అని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 10 బిలియన్ డాలర్లను అధిగమించేలా ఎగుమతులు ఉండబోతున్నాయి.