India-Pakistan War: భారత్ – పాకిస్తాన్ మధ్య రోజు రోజుకీ ఉద్రిక్తతలు పెరిగిపోతూనే ఉన్నాయి.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం.. ఆ తర్వాత పాక్ రంగంలోకి దిగి డ్రోన్లతో విరుచుకుపడడం.. అంతేకాదు.. వాటిని ప్రతిఘటిస్తూనే.. పాకిస్తాన్ సరైన బుద్ధి చెప్పడంలో భారత్ విజయవంతం అయ్యింది.. అయితే, కోపంతో రగిలిపోతోన్న పాక్.. మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఉన్నాయి.. సహరిద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తూ.. బ్లాకౌట్‌లు ప్రకటిస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఇండియన్ ఆర్మీ.. అయితే, ఈ సమయంలో మీ ఫోనే.. మీకు శ్రీరామ రక్షగా నిలవబోతోంది.. Androidతో పాటు iPhoneలలో అత్యవసర హెచ్చరికలను జారీ చేస్తోంది.. ఈ అత్యవసర హెచ్చరికలు జారీ చేసేందుకు ప్రత్యేక నెట్‌వర్క్ ఛానెల్‌ని ఉపయోగిస్తారు.. నెట్‌వర్క్‌లు రద్దీగా ఉన్నప్పుడు కూడా అవి మీ ఫోన్‌ను చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. మనం చేయాల్సిందల్లా.. మన ఫోన్‌లో సెట్టింగ్‌లు కాస్తా మార్చుకుని.. ఆ హెచ్చరికలు వచ్చేలా చూసుకోవడమే..
Read Also: China: భారత్- పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా
భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య శత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో, మీ ఫోన్‌లలో రియల్-టైమ్ హెచ్చరికలు ఉండటం తప్పనిసరి. ఇది త్వరగా స్పందించడానికి.. సురక్షితంగా ఉండటానికి మీకు ఎంతో ఉపయోగపడనుంది.. Android మరియు iPhoneలు రెండూ ప్రభుత్వం లేదా అధీకృత ఏజెన్సీల నుండి అత్యవసర హెచ్చరికలను స్వీకరించడానికి అంతర్గత సెట్టింగ్స్‌ను కలిగి ఉంటాయి. ఈ హెచ్చరికలు ఫ్రీగానే పొందే అవకాశం ఉండగా.. మీ ఫోన్‌లో ఆ వార్నింగ్స్ నేరుగా అందుతాయి. సాధారణంగా భూకంపాలు, వరదలు, ఉగ్రవాద దాడులు లేదా జాతీయ భద్రతా పరిస్థితులు వంటి తీవ్రమైన ముప్పుల గురించి ప్రజలను హెచ్చరించడానికి ప్రభుత్వం నుండి అత్యవసర సందేశాలను కలిగి ఉంటాయి. ఈ హెచ్చరికలు ప్రత్యేక నెట్‌వర్క్ ఛానెల్‌ని ఉపయోగిస్తాయి, నెట్‌వర్క్‌లు రద్దీగా ఉన్నప్పుడు కూడా అవి మీ ఫోన్‌ను చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. అయితే, మీ ఫోన్‌లో అత్యవసర హెచ్చరికలు నిలిపివేయబడితే, మీరు విలువైన సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.. కావున Android మరియు iPhone ఫోన్లలో అత్యవసర హెచ్చరికలను ఎలా ప్రారంభించాలో ఇక్కడ దశలవారీ మీకు అందిస్తున్నాం..
Read Also: Vyomika Singh : మన రాడర్ సెంటర్లను పాక్ టార్గెట్ చేసింది.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ప్రకటన
Android వినియోగదారులు మీ ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. “భద్రత మరియు అత్యవసర పరిస్థితి”పై నొక్కండి లేదా సెట్టింగ్‌ల సెర్చ్ పట్టీలో “అత్యవసర హెచ్చరికలు” కోసం సర్చ్ చేయండి.. అందులో “వైర్‌లెస్ అత్యవసర హెచ్చరికలు” ఎంచుకోండి.. అందుబాటులో ఉన్న అన్ని హెచ్చరిక ఎంపికలను పూర్తి చేయండి.. అయితే, Samsung, Xiaomi లేదా OnePlus వంటి ఫోన్‌లలో సెట్టింగ్స్‌లో పేర్లు మారవచ్చు. మీ ఫోన్ మోడల్‌ను బట్టి “వైర్‌లెస్ అత్యవసర హెచ్చరికలు”.. సెట్టింగ్‌లు లేదా సెల్ ప్రసారం కింద కూడా కనిపించవచ్చు.
Read Also: Vyomika Singh : మన రాడర్ సెంటర్లను పాక్ టార్గెట్ చేసింది.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ప్రకటన
ఇక, iPhone వినియోగదారుల విషయానికి వస్తే.. సెట్టింగ్‌ల యాప్‌ను తెరిచి నోటిఫికేషన్‌లకు వెళ్లండి.. దిగువకు స్క్రోల్ చేసిన తర్వాత ప్రభుత్వ హెచ్చరికలను ఎంచుకొండి.. క్లిష్టమైన అప్‌డేట్స్ స్వీకరించడానికి హెచ్చరికలను సెలక్ట్ చేసుకోండి.. ఈ హెచ్చరికలను చురుకుగా ఉంచడం వల్ల అత్యవసర పరిస్థితిలో.. అలర్ట్‌లు, ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. వాటికి సంబంధించిన హెచ్చరికలు పొందడం వీలవుతుంది..
Read Also: Operation Sindoor Film First Poster Out: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సినిమా.. ఫస్ట్ లుక్ విడుదల
కాగా, బుధవారం ‘ఆపరేషన్ సిందూర్’ అనే కోడ్ నేమ్ తో, 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారతదేశం 25 నిమిషాల్లో 24 క్షిపణులను పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ప్రయోగించింది. బుధవారం మరియు గురువారం మధ్య రాత్రి, ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని 15 నగరాల్లోని అనేక సైనిక లక్ష్యాలను డ్రోన్లు మరియు క్షిపణులను ఉపయోగించి లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని అది భగ్నం చేసింది. గురువారం, శుక్రవారం మధ్య రాత్రి, పాకిస్తాన్ సాయుధ దళాలు మొత్తం పశ్చిమ సరిహద్దులో డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి భారత్‌పై దాడులను ప్రారంభించాయి, వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలతో భారతదేశంలో విమాన ప్రయాణాన్ని ప్రభావితం చేసింది, మే 15 వరకు 32 విమానాశ్రయాలు మూసివేసిన విషయం విదితమే..