iPhone: ఇటీవల యువత తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటామని ఓ విధంగా పేరెంట్స్‌ని బ్లాక్‌మెయిల్ చేసి, తమకు కావాల్సినవి సాధించుకుంటున్నారు. పిల్లల కోరికల్ని తీర్చేందుకు తల్లిదండ్రులు నలిగిపోవాల్సి వస్తోంది. తాజాగా, ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఐఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యాయత్నాన్నికి పాల్పడింది. ఈ ఘటన బీహార్‌లోని ముంగేర్‌లో జరిగింది.
అమ్మాయి తన పేరెంట్స్ తనకు రూ. 1. లక్షల విలువైన ఐఫోన్ కొనివ్వాలని కోరింది. దీని సాయంతో తన పార్ట్‌నర్‌తో మాట్లాడాలని అనుకుంది. ఈ అభ్యర్థనను పేరెంట్స్ తిరస్కరించడంతో బ్లేడుతో మణికట్టుని కోసుకుని, చేతిని అనేక చోట్ల గాయపరుచుకుంది. సదరు అమ్మాయి మూడు నెలలుగా తన తల్లిని ఐఫోన్ కావాలని అడుగుతూనే ఉంది. ఐఫోన్ లేకపోవడంతో తాను తన భాగస్వామితో మాట్లాడలేకపోతున్నానని చెబుతోంది. తామిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నామని చెప్పింది.
Read Also: Hyderabad: క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య.. మృతుడి చివరి ఫోన్ కాల్ లో ఏముందంటే?
తల్లి ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పినా వినకుండా, ఆమె గదిలోకి వెళ్లి బ్లేడుతో తీవ్రంగా గాయపరుచుకుంది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. ‘‘నా పార్ట్‌నర్ ఇంకా చదువుతున్నాడు. అందుకే నాకు ఫోన్ కొనివ్వలేకపోయాడు. నేను అతడితో మాట్లాడటం కష్టంగా ఉంది. కాబట్టి నేను రూ. 1.5 లక్షల ఐఫోన్ అడుగుతున్నాను’’ అని అమ్మాయి చెప్పింది.
ఆ అమ్మాయి తల్లి, ఆమె భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కుమార్తెకు అంత ఖరీదైన మొబైల్‌ను అందించలేకపోయామని చెప్పారు. “మేము పేదవాళ్ళం. ఆమెకు అంత ఖరీదైన మొబైల్‌ను ఎలా కొనగలం ? నా భర్త కూలీ పని ద్వారా సంపాదించే డబ్బుతో మా ఇల్లు నడుస్తుంది” అని తల్లి చెప్పింది. ఆస్పత్రిలో అమ్మాయికి చికిత్స జరుగుతోంది.