ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ కు తరలించాలని యోచిస్తోంది.భారత్‌లో ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్‌లో తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధ చేస్తోంది. తాజాగా ఈ అంశాలపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు.
READ MORE: PM Modi: ‘‘ఇక చాలా మందికి నిద్ర పట్టదు’’.. కేరళలో మోడీ సంచలన వ్యాఖ్యలు..
అమెరికా మార్కెట్‌లో అవసరమయ్యే సగం ఐఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తామని టిమ్ కుక్ ప్రకటించారు. దీనికి గల బలమైన కారణాన్ని ఆయన వెల్లడించారు. చైనాతో పోలిస్తే భారత్‌పై అమెరికా తక్కువ సుంకాలు విధించిందని వెల్లడించారు. అందుకే ఈ ఐఫోన్లు ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే యాపిల్ ఇతర ఉత్పత్తులను వియత్నాంలో తయారు చేస్తున్నామని సీఈఓ చెప్పుకొచ్చారు. అమెరికాలో భారీ సంఖ్యలో విక్రయించబోయే ఐఫోన్లకు భారత్ కీలక తయారీ కేంద్రంగా అవుతుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అమెరికా సుంకాలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందో తెలియదన్నారు. దీంతో సుంకాల ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నామని స్పష్టం చేశారు. యాపిల్ త్రైమాసిక ఫలితాలు విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Beerla Ilaiah : ఇప్పుడు గుర్తుకు వచ్చిందా… ఎమ్మెల్సీ కవితపై బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తులైన అమెరికా, చైనాల మధ్య పరస్పర సుంకాల నేపథ్యంలో వాణిజ్య యుద్ధం రాజుకుంది. టారిఫ్‌ల విషయంలో ఇరుదేశాలు తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఈక్రమంలో అమెరికా సుంకాలకు భయపడి యాపిల్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందుకే అమెరికా మార్కెట్లో విక్రయించే ఐఫోన్లను భారత్‌లో తయారు చేసి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.