ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Gas Refilling Fraud: ప్రస్తుత కాలంలో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అదే క్రమంలో గ్యాస్ వినియోగంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం.
తాడిపత్రిలో రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఎనిమిది గంటలుగా అల్లర్ల ఘటనప్తె నమోద్తెయిన కేసుల వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను సంబంధించి ఎస్ హెచ్ ఓ లను అడిగి తెలుసుకుంటున్నారు.
తిరుపతిలో సిట్ బృందం చేపట్టిన విచారణ కొనసాగుతోంది. మరో రెండు, మూడు గంటలు పాటు విచారణ సాగే అవకాశం ఉంది. దాడి ఘటనపై పలు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను, దాడి సమయంలోని తీసినా వీడియోలు సిట్ పరిశీలిస్తోంది.
తీహార్ జైల్లో తోటి ఖైదీని క్రికెట్ బ్యాట్ తో కొట్టి హత్య చేసిన కేసులో నలుగురు అండర్ ట్రయల్ ఖైదీలను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. మూడేళ్ల నాటి ఈ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారించింది.
బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ పై సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు. విశాఖ పోర్టులో తనిఖీలకు వచ్చిన సీబీఐ, కస్టమ్స్ అధికారులను కంటైనర్ తెరవకుండా ఆపడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. డ్రగ్స్ దిగుమతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండానే ఇన్ని వేల కోట్ల మాదకద్రవ్యాలను డ్రై…
ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి అయింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ఇదిలా ఉంటే.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్…
రేపు సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుకావడంలేదు. సీబీఐ విచారణకు ఎందుకు రావడం లేదోనని సుదీర్ఘ లేఖ రాసింది కవిత. కాగా.. లిక్కర్ స్కాం కేసులో రేపు తమ ముందు హాజరు కావాలని కవితకు సీబీఐ 41ఏ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాసింది. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించింది ఎమ్మెల్సీ కవిత. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి…
శ్రీశైలం దేవస్థాన పరిధిలోని గౌరీ సదనంలో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 137 రూమ్లో వాళ్లు చనిపోయి ఉన్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన మల్లేష్ అనే వ్యక్తి.. ఈనెల 13న రూమ్ తీసుకున్నట్లు ఎంట్రీ బుక్లో నమోదు చేశారు. అయితే పక్కన గదిలో ఉన్న యాత్రికులు దుర్గంధం వస్తుందని ఆలయ అధికారులకు చెప్పడంతో ఈ విషయం బయట పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, దేవస్థానం అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా…