శ్రీశైలం దేవస్థాన పరిధిలోని గౌరీ సదనంలో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 137 రూమ్లో వాళ్లు చనిపోయి ఉన్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన మల్లేష్ అనే వ్యక్తి.. ఈనెల 13న రూమ్ తీసుకున్నట్లు ఎంట్రీ బుక్లో నమోదు చేశారు. అయితే పక్కన గదిలో ఉన్న యాత్రికులు దుర్గంధం వస్తుందని ఆలయ అధికారులకు చెప్పడంతో ఈ విషయం బయట పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, దేవస్థానం అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా.. ఆత్మహత్య చేసుకున్నది ఇద్దరు దంపతులా లేక ప్రేమజంట అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.