ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి అయింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. మరోవైపు.. తొలిరోజు కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆప్ కు ఇచ్చిన వంద కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎవరెవరు డబ్బు సమకూర్చారని ఆధారాలు చూపించి ఈడీ ప్రశ్నించింది. కొన్నింటికి సమాధానాలు ఇచ్చి మరికొన్నింటిపై మౌనం వహించింది కవిత. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన 192 కోట్ల మాటేంటని ప్రశ్నించింది ఈడీ. కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు చూపించి ప్రశ్నించింది. ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేశారని ఈడీ కవితను ప్రశ్నించింది.
Read Also: Betting: ఆయనకి టిక్కెట్ ఇచ్చినందుకు.. అర గుండు, అర మీసం గీయించుకున్న వ్యక్తి..!
విచారణ తర్వాత కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ఇదిలా ఉంటే.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Perni Nani: సభ జరుపుకోవడం చేతకానటువంటివాళ్లు జగన్‌పై యుద్ధం చేస్తారా?
ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ ఎదుట కవిత తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈనెల 23వరకు ఈడీ కస్టడీ విధించారు. మరోవైపు.. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతీరోజూ సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలుసుకునే వెసులుబాటును కవితకు న్యాయస్థానం కల్పించింది.
Read Also: MK Stalin: సీఏఏ తర్వాత బీజేపీ టార్గెట్ ఇదే.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..