తాడిపత్రిలో రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఎనిమిది గంటలుగా అల్లర్ల ఘటనప్తె నమోద్తెయిన కేసుల వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను సంబంధించి ఎస్ హెచ్ ఓ లను అడిగి తెలుసుకుంటున్నారు. గొడవలకు సంబంధించి వీడియో పుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు. సిట్ బృందాన్ని కలవడానికి వైసీపీ లీగల్ సెల్ సభ్యులు తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు వ్యవహారించిన తీరుప్తె వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
READ MORE: Swati Maliwal: ‘‘మనీష్ సిసోడియా అక్కడ ఉండుంటే..’’ స్వాతిమలివాల్ సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా.. మరోవైపు పల్నాడులో రెండో రోజు సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. రెండ్రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న సిట్ అధికారులు.. అప్పటినుంచి ఇప్పటివరకు పలు కేసులపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరో రెండు గంటల పాటు దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. దర్యాప్తులో పూర్తి సారాంశాన్ని ఈ రాత్రి కి లేదా, రేపు ఉదయం సిట్ టీం చీఫ్ వినీత్ బ్రిజల్ కు అందించనున్నారు.. సిట్ బృందం సభ్యులు. కాగా.. ఏపీలో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా నియమించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. సిట్ విచారణ వేగం పెంచింది. ఈ రోజు రాత్రి వరకు పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు అందించే అవకాశం ఉంది.