వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిపిన తీరు అత్యంత దారుణమని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. దర్యాప్తు సంస్థల చరిత్రలోనే వివేకా కేసు మచ్చుతునక అని అన్నారు.
సచిన్ తో ప్రేమలో పడి.. నేపాల్ మీదుగా ఇండియాలోకి వచ్చిన సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సీమా ప్రేమికురాలేనా.. లేదా పాకిస్థాన్ గూఢచారా అనే అనుమానాలు తావెత్తుతున్నాయి. సీమా హైదర్ ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం విచారణ ముగిసింది. బీబీనగర్‌లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన క్లూస్ టీమ్ మంటల్లో కాలిపోయిన బోగీలను తనిఖీ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు చెబుతామని అధికారులు చెప్పారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఎం భద్రతా వలయాన్ని దాటుకుని ఓ బైకు ముఖ్యమంత్రికి వద్దకు అత్యంత సమీపంగా దూసుకురావడం కలకలం రేపింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శిరీష ఎక్కడైతే మృతి చెందిందో.. ఆ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం శిరీష ఇంటికి వెళ్ళి శిరీష తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా శిరీష మృతికి ముందు ఇంట్లో జరిగిన గొడవపై కూడా ఆరా తీశారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక మలుపు.. డీఈ రమేష్ 80 మందికి ఏఈ పేపర్ అమ్మినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పూల సురేష్ నుంచి ఏఈ పేపర్ తీసుకొచ్చిన డీఈ రమేష్.. పెద్దపల్లి, కరీంనగ్ జిల్లాల్లో అభ్యర్థులకు పేపర్ విక్రయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
Terror suspects: హైదరాబాద్ ఉగ్ర కోణంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేరళ స్టోరీని మించిన అంశాలు బయటపడ్డాయి. భోపాల్ కు చెందిన ఈ యాసిర్ ఉగ్ర కోణంలో కీలక సూత్ర దారిగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఐదుగురిని అనుమానితుల్ని ఆదుపులోకి తీసుకున్నారు.