బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ పై సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు. విశాఖ పోర్టులో తనిఖీలకు వచ్చిన సీబీఐ, కస్టమ్స్ అధికారులను కంటైనర్ తెరవకుండా ఆపడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. డ్రగ్స్ దిగుమతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండానే ఇన్ని వేల కోట్ల మాదకద్రవ్యాలను డ్రై ఈస్ట్ పేరుతో దిగువమతి చేశారా అని ప్రశ్నించారు.
Read Also: Odisha: నవీన్ పట్నాయక్‌తో పొత్తుపై బీజేపీ క్లారిటీ
గతంలో అనేక మార్లు మాదకద్రవ్యాలు దిగుమతి అయినట్టు ఆరోపణలు వచ్చాయని.. వాటి పై విచారణ ఏమైందో తెలియదని, అయితే ఇపుడు విశాఖ తీరానికి చేరిన కంటైనర్ డ్రగ్స్ ను చూస్తుంటే ఇదేదో చిన్న విషయం కాదన్నారు. దీని వెనుక ఏదో రాకెట్ దాగిఉందని, చేపల మేత తయారీలో వినియోగించే డ్రైఈస్ట్ పేరుతో దిగుమతి చేసుకున్న కంపెనీ వ్యవహారాలు వెనుక ఎవరున్నారు. దీనికి కారకులు ఎవ్వరో, ఆ సంస్థకు యజమానులెవ్వరో బయటకు తీయాలని గోరంట్ల బుచ్చియ్యచౌదరి డిమాండ్ చేశారు.
Read Also: Jio: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. జియో బిగ్ ఆఫర్
వేల కిలోల వంతున డ్రగ్స్ రాష్ట్రానికి వస్తుంటే.. రాష్ట్రంలో యువత ఏమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం ప్రభుత్వమే డ్రగ్స్ రప్పించిందా అనే అనుమానాలు కలుగుతున్నాయని గోరంట్ల ఆరోపించారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకునే సమయంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడంతోనే ఏదో కుట్ర వుందని, అందుకే డ్రగ్స్ వ్యవహారంపై మొత్తానికి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలకితీయాలని గోరంట్ల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.