New York: బాల్యం, యవ్వనం, వృద్దాప్యం పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఈ మూడు దశలు కచ్చితంగా ఉంటాయి. అతిలోక సుందరి అయిన, అందాల చంద్రుడైనా ఎవరైన ఒక వయసు వచ్చాక యవ్వనంలో ఉన్న అందాన్ని కోల్పోవడం సహజం. అయితే ఆ అందాన్ని కాపాడుకోవడానికి మనలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే 4 పదుల వయసులో నవ యువకుడిలా కనపడేందుకు వివిధ రకాల మాత్రలు,ఇంజెక్షన్లు తీసుకుంటూ తనపై తానే ప్రయోగాలు చేసుకుంటూ వార్తల్లో నిలిచాడు టెక్ బిలియనీర్ బ్ర్యాన్ జాన్సన్ (45). అయితే అతను చేసిన ట్వీట్ ఆయన్ని మరోసారి వార్తల్లో నిలిపింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటా అనుకుంటున్నారా..? తన రక్తం ఎక్కించుకోవడం వల్ల తన తండ్రి వయసు తగ్గిందని ట్వీట్ చేశారు.
Read also:Harish Rao: కర్ణాటకలో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. ఇక్కడ ఇస్తామంటే నమ్ముతారా..?
వివరాల్లోకి వెళ్తే.. X (ట్విట్టర్)వేదికగా జాన్సన్ ఓ ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ లో సాధారణంగా మన వయసు పెరిగే పరిక్రియ యవ్వనంలో తక్కువగాను 40 ధాటిన తరువాత వేగంగాను ఉంటుంది. ఈ నేపథ్యంలో 70 ఏళ్ల వయసున్న మా తండ్రిపై ప్రయోగాన్ని చేసాను. నేను రోజు 30 మంది వైద్యుల పర్యవేక్షణలో వారు చెప్పిన ఆహారమే తింటూ, రకరకాల వ్యాయామాలు చేస్తూ అలానే మాత్రలు మింగుతూ, నిత్యం వైద్య పరీక్షలు చేయించుకుంటూ అత్యంత ఆరోగ్యంతో ఉన్నాను. దీనితో నా ప్లాస్మాను ఒక లీటరు మేర మా తండ్రికి ఎక్కించాను. ఇలా చేసిన తర్వాత మా తండ్రి శరీరంలో వయసు పెరుగుదల వేగం 46 ఏళ్ల వ్యక్తిలో వయసు పెరుగుదల వేగంతో సమానంగా ఉంది. ఈ ప్రయోగం చేసిన ఆరు నెలల తర్వాత కూడా ఆయనలో వయసు పెరుగుదల వేగం అదేస్థాయిలో ఉంది.
Read also:Mahmood Ali: రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ తో ప్రయాణం చేసి టీడీపీ, కాంగ్రెస్ లోకి మారారు..
ప్రయోగానికి ముందు ఆయనలో ఏజింగ్ వేగం 71 సంవత్సరాల వయసు వ్యక్తికి ఉండే స్థాయిలో ఉండేది. కానీ ప్రస్తతం అలా లేదు. కాగా మా తండ్రి ఏజింగ్ వేగం తగ్గడానికి కారణం ఆయన శరీరం నుంచి 600 మిల్లీలీటర్ల ప్లాస్మా తొలగించడమా? లేక తన శరీరం నుంచి తీసిన లీటర్ ప్లాస్మాను ఎక్కించడమా? అనే విషయం తెలియదని.. ఏదేమైనా నేను మా తండ్రికి ‘బ్లడ్‌బాయ్’నని ఎక్స్‌లో రాసుకొచ్చారు.