Bangladesh: జనవరి 7న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఎన్నికల సంఘం తెలిపింది. రిగ్గింగ్ అవుతుందనే భయంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని బెదిరించాయని ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ బుధవారం తెలిపారు. బంగ్లాదేశ్ లోని 300 స్థానాలకు 12వ పార్లమెంటరీ ఎన్నికలు జనవరి 7న జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ హబీబుల్ అవల్ తెలిపారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీలు చర్చలు జరపాలని కోరారు.
దీనికి నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌ని ప్రధాని షేక్ హసీనా 15 ఏళ్లుగా పాలిస్తు్న్నారని, నియంతృత్వంలో పరిపాలన కొనసాగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్షాల బహిష్కరణ కొనసాగితే ఆమె నాలుగోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
Read Also: Jammu Kashmir: చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల హతం..
హసీనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇస్లామిక్ ర్యాడికలైజేషన్‌ని అణిచివేస్తోంది. దీంతో పాటు బంగ్లా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం గత రెండు ఎన్నికల్లో ఆమె ఓట్లు రిగ్గింగ్ చేసి గెలించిందని ఆరోపిస్తున్నాయి. ఆమె రాజీనామా చేసి తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రతిపక్షాలు భారీ ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఈ నిరసనలను కారణమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)కి చెందిన చాలా మంది అగ్రనేతలను, వేలాది మంది నిరసనకారుల్ని హసీనా ప్రభుత్వం జైళ్లలో వేసింది.
ఇదిలా ఉంటే అధికార అవామీ లీగ్ ఎన్నికల తేదీని ప్రకటించడాన్ని ఆనందకరమైన రోజుగా అభివర్ణించింది. బీఎన్పీ మాత్రం ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించింది. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ లో అతిపెద్ద ఇస్లామిక్ పార్టీ అయిన జమాతే ఇస్లామా, ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్(ఐఏబీ) పార్టీ ఇలాగే హసీనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
అరెస్టుకు భయపడి అజ్ఞాతంలో ఉన్న బీఎన్పీ పార్టీ అధికార ప్రతినిధి రుహూల్ కబీర్ రిజ్వీ ఎన్నికలను తిరస్కరిస్తున్నట్లు ఆన్ లైన్ వీడియోలో వెల్లడించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరుగుతాయన్నది పూర్తి అబద్ధమని, ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహిస్తోందని ఆయన ఆరోపించారు. బుధవారం వేలాది మంది ఐఏపీ మద్దతుదారులు ఎన్నికల సంఘాన్ని ముట్టడించారు. బంగ్లాదేశ్ లో అమెరికా రాయబారి పీటర్ హాస్ రాజకీయ ప్రతిష్టంభన తొలగించే ప్రయత్నంలో భాగంగా మూడు పార్టీ నాయకులతో సమావేశాలకు పిలుపునిచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ ఎన్నికల ప్రకటన వెలువడింది.
తాజావార్తలు
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!