China: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్.. సెకన్‌లో 150 సినిమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా మరోసారి సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ని ఆవిష్కరించింది. ఇది సెకనుకు 1.2 టెరాబిట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలదని దీన్ని సదరు కంపెనీ వెల్లడించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఈ వేగం ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే దాదాపుగా 10 రెట్లు అని చెప్పింది.
ఈ ప్రాజెక్టు సింఘువా యూనివర్సిటీ, సెర్నెట్ కార్పొరేషన్, హువాయ్ టెక్నాలజీ సహాకరాంతో 3000 కిలోమీటర్ల మేర ఈ ఇంటర్నెట్ వ్యవస్థను విస్తరించారు. బీజింగ్ర, వుహాన్, గ్వాంగ్ జౌల మధ్య ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సిస్టమ్ ద్వారా అనుసంధించారు. ఆశ్చర్యకరరీతిలో సెకనుకు 1.2 టెరా బిట్( 1200 గిగాబైట్) డేటాను ట్రాన్స్‌మిట్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని చాలా ఇంటర్నెట్ బ్యాక్‌బోన్ నెట్వర్క్‌లు సెకనుకు కేవలం 100గిగాబిట్ల వేగంతో పనిచేస్తాయి. బీజింగ్-వూహాన్-గ్వాంగ్ జౌ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్టక్చర్‌పై గత దశాబ్ధకాలంగా చైనా పనిచేస్తోంది. తాజాగా ఈ నెట్వర్క్ ద్వారా అత్యంత వేగంగా ఇంటర్నెట్ ప్రసారాలు జరిగాయి. ఈ నెట్వర్క్ జూలై నెలలో ప్రారంభమైనప్పటికీ.. సోమవారం అధికారంగా ప్రారంభించారు.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
Read Also: Israel-Hamas War: గాజాలో పిల్లలు చనిపోవడం ఆగాలన్న జస్టిన్ ట్రూడో.. ఇజ్రాయిల్ ప్రధాని స్పందన ఇదే..
ఈ నెట్వర్క్ ఎంత వేగంగా పనిచేస్తుందనే దాన్ని వివరించేందుకు హువాయ్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ ఓ ఉదాహరణను చెప్పారు. ఇది కేవలం 150 హైడెఫినేషన్(హెచ్‌డీ) సినిమాలకు సమానమైన డేటాను కేవలం ఒక సెకనులోనే ట్రాన్స్‌ఫర్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడించారు.సింఘువా యూనివర్సిటీకి చెందిన జుమింగ్ వీ ఈ కొత్త ఇంటర్నెట్ వ్యవస్థని సూపర్ ఫాస్ట్ రైల్ ట్రాకుతో పోల్చారు. ఇది మొత్తం డేటాను తీసుకెళ్లడానికి 10 ట్రాకుల అవసరాన్నీ భర్తీ చేస్తుందని, దీని ఫలితంగా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!