UK: అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా పెళ్లి గురించి ఎన్నో కలలు కంటారు. ఎలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తాడా అని అనుకుంటూ తన ఎక్సపెక్టేషన్స్ కి తగిన వ్యక్తి రావాలని కోరుకుంటారు. అయితే కొందరికి పెళ్ళికి అర్ధం తెలియని వయసులోనే పెళ్లి జరిగి పోతుంది. తనకు పెళ్లి వయసు వచ్చేసరికి ఆమె అమ్మ అవుతుంది. అమ్మ వయసుకు అమ్మమ్మ అవుతుంది. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అయితే తాజాగా ఓ అమ్మమ్మ రెండో పెళ్ళికి రెడీ అవుతుంది. వివరాలలోకి వెళ్తే.. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన రేచెల్ మెక్‌ఇంటైర్ అనే మహిళకి ఆడుకునే వయసులో అంటే కేవలం 13 సంవత్సరాలకే పెళ్లి జరిగింది. కాగా ఆమె 15 ఏళ్ళ వయసులోనే ఓ పాపకు జన్మనిచ్చి అమ్మ అయింది. కాగా ఆ పాప పెరిగి పెద్దదైంది. ఈ నేపథ్యంలో రేచెల్ తన కూతురికి కూడ పెళ్లి చేసింది.
Read also:ChatGPT : చాట్‌జీపీటీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ను తొలగించిన ఓపెన్ఏఐ.. కారణం ఇదే?
కాగా రేచెల్ కూతురు కూడా ఓ పాపకు జన్మనిచ్చింది. దీనితో 33 సంవత్సరాలకే రేచెల్ అమ్మమ్మ అయింది. అయితే రేచెల్ కొంతకాలం క్రితం మూరత్ అనే యువకుడిని చూసింది. తొలి చూపులోనే రేచెల్ ఆ యువకుడి ప్రేమలో పడింది. కాగా ఆ తరువాత ఇద్దరి మధ్య పెరిగిన పరిచయం ప్రేమగా మారింది. ఇదే విషయాన్నీ రేచెల్ తన కూతురుకు చెప్పగా ఆమె పెళ్ళికి ఓకే అన్నది. దీనితో రేచెల్ తన ఆనందాన్ని మీడియా తో పంచుకుంది. ఈ నేపథ్యంలో రేచెల్ మాట్లాడుతూ.. మూరత్ ప్రవర్తన తనను ఎంతగానో ఆకట్టుకుందని.. అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. కాగా తన నిర్ణయానికి ఆమె కుమార్తె కూడా మద్దతు తెలిపిందంటూ’ పెళ్లి కుమార్తెగా మారబోతున్న రాచెల్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.