Earthquake in Sri Lanka: ద్వీప దేశం శ్రీలంకను భూకంపం వణికించింది. శ్రీలంక రాజధాని కొలోంబోలో భూమి శక్తవంతమైన ప్రకంపనలు సృష్టించింది. దీంతో శ్రీలంక ప్రజలు భయంతో పరుగుల తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు రిపోర్టు అందలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సమాచారం మేరకు భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. ఇది అత్యంత శక్తవంతమైన భూకంపంగా అధికారులు వెల్లడించారు. శ్రీలంకకు ఆగ్నేయదిశగా 1,326 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
Also Read: Polimera 2 Director: చిరంజీవితో సినిమా.. నా వల్ల కాదు!: పొలిమేర 2 డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
కాగా, శ్రీలంకకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని, శ్రీలంకకు ఎలాంటి ప్రమాదం లేదని జియెలాజికల్ సర్వే అండ్ మైన్స్ బ్యూరో వెల్లడించింది. ఇదిలా ఉంటే సోమవారం దక్షిణ సూడాన్, ఉగాండా సరిహద్దు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా భూకంపం వాటిల్లింది. యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ఈ మేరకు ప్రకటన ఇచ్చింది. అదే రోజు తజికిస్తాన్2లో 4.9 తీవ్రతతో సాయంత్రం 5.46 గంటలకు భూకంపం సంభవించింది. కాగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇటీవల కాలంలో తరచుగా భూకంపాలు చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది. నవంబర్ 11న న్యూఢిల్లీలో భూకంపం సంభవించింది. అలాగే మన పొరుగు దేశం నేపాల్లో సైతం ఇటీవల భూకంపం రాగా.. వందకు పైగా మృత్యువాత పడ్డారు.
Also Read: Manchu Lakshmi: మంచు లక్ష్మీకి ముద్దు ఇచ్చిన అల్లు హీరో.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో