Raghava Lawrence : దర్శకధీరుడు రాజమౌళి తీసిన విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు రవి రాథోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఓ సీన్ లో ‘రేయ్ సత్తి బాల్ ఒచ్చిందా అని ఓ పిల్లాడు రవితేజను అడుగుతాడు. హా ఆ పిల్లాడే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విక్రమార్కుడు తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. కానీ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో లారెన్స్ చేరదీసి ఓ స్కూల్ లో…
Raghava Lawrence : హీరో లారెన్స్ గురించి తెలిసిందే. తన సంపాదనలో ఎంతో మందికి సాయం చేస్తూనే ఉంటాడు. తన దగ్గరకు వచ్చిన వారికి కాదనకుండా తనవంతుగా సాయం అందిస్తాడు. ఇప్పుడు ఓ దివ్యాంగురాలికి చేసిన సాయం లారెన్స్ ను మరో ఎత్తులో నిలబెట్టింది. తాజాగా దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శ్వేతకు ఇప్పటికే స్కూటీ కొనిచ్చాడు. ఆమె నడిచేందుకు సపోర్ట్ గా ఉండే వాటిని కొనిచ్చాడు. కానీ ఆమె పూరి గుడిసెలో…
Spanish MBBS Doctor Became Sanyasi: నేటి ప్రపంచంలో చాలా మంది డబ్బు, హోదా, విలాసాల కోసం పోటీ పడుతున్నారు. కానీ.. ఆత్మ శాంతి, జీవితానికి నిజమైన అర్థాన్ని వెతుక్కుంటూ భౌతిక సుఖాలను వదులుకునే వారు కొందరు ఉన్నారు. తాజాగా ఓ విదేశీ మహిళ విలాసవంతమైన జీవితం విడిచి సాధ్విగా మారింది. వృత్తిరీత్యా వైద్యురాలైన స్పానిష్ అమ్మాయి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. తమ దేశంలో అన్నీ వదిలి భారతదేశానికి వచ్చి సనాతన ధర్మాన్ని స్వీకరించి సాధ్విగా…
X లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్నారి విహాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజున సేవా మార్గాన్ని ఎంచుకున్న విహాన్‌కు పవన్ కళ్యాణ్ నుండి హృదయపూర్వక అభినందనలు అందాయి. తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు పవన్ కళ్యాణ్ ప్రశంశించారు. విహాన్ ఉదారత చూసి ప్రేరణ పొందినట్టు తెలిపిన పవన్ కళ్యాణ్, అనారోగ్య పరిస్థితిలోనూ సేవా కార్యం చేయడం గర్వకారణం అన్నారు. చిన్న వయసులో పెద్ద హృదయాన్ని చూపించి అందరి మనసులను గెలుచుకున్న…
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) భూషణ్ రామకృష్ణ గవాయ్ శుక్రవారం (జూన్ 27) జరిగిన ఓ కార్యక్రమంలో తన భావాలను పంచుకున్నారు. నాగ్‌పూర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలో అత్యున్నత న్యాయ పదవిని చేరుకున్నందుకు సీజేఐ గవాయ్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రుల కృషి, పోరాట కథను వివరించారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
ప్రస్తుతం కాలంలో ఎక్కువ రోజులు బతకడం కష్టం. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది 60-70 మధ్యలోనే మరణిస్తున్నారు. మరి కొందరు రోగాలు, ప్రమాదాలు సంభవించి మధ్యలోనే మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా వృద్ధ తల్లి, కుమార్తెల అసమాన ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Joan Alexander: ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తి 60 ఏళ్ళు బతకడమే కష్ట సాధ్యంగా మారింది. అలాంటిది ఏకంగా ఒక మహిళ తన జీవితకాల ఆశయాన్ని 88 ఏళ్ల వయస్సులో పూర్తిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అమెరికాలోని మెయిన్ విశ్వవిద్యాలయంలో జోన్ అలెగ్జాండర్ అనే మహిళ డిగ్రీ పట్టా పొంది అందరిని ఆశ్చర్యపరిచింది. ఆరు దశాబ్దాల క్రితం గర్భవతి అయినందుకు ఆమెను డిగ్రీ పూర్తి చేయనివ్వలేదని సమాచారం. కానీ, ఇప్పుడు ఆమె బాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్…
Auto Driver: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన అబ్దుల్ సామీ అనే ఆటో డ్రైవర్ కథ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇతడు ఓ సాధారణమైన వ్యక్తి. పెద్దగా చదువుకొనే అవకాశం రాకపోవడంతో, ఆటో డ్రైవింగ్ నేర్చుకుని ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. ఆర్థికంగా వెనుకబడిన సామీకి వ్యాపారాలూ, పెట్టుబడులూ అంటే తెలియవు. అతడికి తెలిసిందల్లా ఆటో నడపడమే. దాన్ని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా జీవన పోరాటం కొనసాగించాడు. కానీ, అతడి జీవితాన్ని మలుపు తిప్పిన…
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నివాసి రాజ్‌కుమార్ మిశ్రా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. ఆయన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి మేయర్ ఎన్నికల్లో గెలిచారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రాజ్ కుమార్ లండన్ లోని వెల్లింగ్ బరో నగర మేయర్ గా ఎన్నికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.
IAS Srinath Inspirational Story: కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో పోర్టర్‌గా పనిచేసిన శ్రీనాథ్ కథ అందరికి స్ఫూర్తి. ఆయన ఇబ్బందులను ఎదుర్కొని., తన కుమార్తె భవిష్యత్తును మెరుగుపరచడానికి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఆదాయం తక్కువగా ఉండడంతో కూతురికి మెరుగైన విద్యను అందించి జీవితాన్ని అందించాలనే శ్రీనాథ్ ఆందోళన అతన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యేలా చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీనాథ్ తన కూతురికి మంచి జీవితం కోసం రైల్వే స్టేషన్లో…