Joan Alexander: ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తి 60 ఏళ్ళు బతకడమే కష్ట సాధ్యంగా మారింది. అలాంటిది ఏకంగా ఒక మహిళ తన జీవితకాల ఆశయాన్ని 88 ఏళ్ల వయస్సులో పూర్తిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అమెరికాలోని మెయిన్ విశ్వవిద్యాలయంలో జోన్ అలెగ్జాండర్ అనే మహిళ డిగ్రీ పట్టా పొంది అందరిని ఆశ్చర్యపరిచింది. ఆరు దశాబ్దాల క్రితం గర్భవతి అయినందుకు ఆమెను డిగ్రీ పూర్తి చేయనివ్వలేదని సమాచారం. కానీ, ఇప్పుడు ఆమె బాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిగ్రీని సాధించారు.
1950లలో జోన్ అలెగ్జాండర్ మెయిన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఆమె 1959లో డిగ్రీ పూర్తి చేయాల్సి ఉండగా, అప్పుడే ఆమె గర్భవతి అయ్యింది. దాంతో కోర్సులో భాగంగా ఉండే స్టూడెంట్ టీచింగ్‌ను పూర్తి చేయనివ్వలేదు. ఇది ఆమెకు చాలా బాధ కలిగించింది. తాను డిగ్రీని పూర్తి చేయలేకపోయిన బాధ జీవితాంతం ఆమెను వెంటాడింది. అయితే, ఇటీవల ఆమె కుమార్తె ట్రేసీ అలెగ్జాండర్, విశ్వవిద్యాలయాన్ని సంప్రదించి తల్లి డిగ్రీ పూర్తయ్యే అవకాశం ఉందా అని అడిగారు. దానికి ఆ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ జస్టిన్ డిమెల్ జోన్ కథ విని చలించిపోయారు. ఆ తర్వాత ఆమె గత అనుభవాన్ని పరిశీలించగా.. గతంలో ఆమె జోన్ ఒక ప్రీ-స్కూల్ ప్రోగ్రామ్‌లో ఫుల్ టైం టీచింగ్ ఎయిడ్‌గా పని చేసినట్లు గుర్తించారు.
Read Also: Harish Rao: 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌ది..
ఆ తర్వాత ఆమె చిన్నారుల వర్బల్ కమ్యూనికేషన్, మోటార్ స్కిల్స్, క్రియేటివ్ ప్లే, అక్షర జ్ఞానం తదితర రంగాల్లో కృషి చేశారు. ఈ అనుభవం ఆమెకు అవసరమైన స్టూడెంట్ టీచింగ్‌కు సరిపోతుందని నిర్ణయించి యూనివర్సిటీ అధికారికంగా డిగ్రీను మంజూరు చేసింది. ఈ సందర్బంగా డిమెల్ మాట్లాడుతూ.. “జోన్ కథ నన్ను కదిలించింది. ఆమె చేసిన పని గుర్తింపు పొందాలని అనిపించిందన్నారు. ఆ తర్వాత 2024 మే 11న జోన్ అలెగ్జాండర్‌కు మెయిన్ విశ్వవిద్యాలయం పట్టా మంజూరు చేసింది. ఆమె వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయినా.. ఆమె కుమార్తె ట్రేసీ, మనవరాలు ఇసాబెల్ బెక్ హాజరై పట్టాను అందుకున్నారు.
ఈ విషయమై జోన్ మాట్లాడుతూ.. నా భర్త, నా నలుగురు కుమార్తెలకు డిగ్రీలు ఉన్నాయి. నేనొక్కదాన్నే పుతి చేయలేదు అనిపించేది. ఇప్పుడు ఈ డిగ్రీ ద్వారా నాకు ఓ ముగింపు, సంపూర్ణత భావన కలుగుతుందన్నారు. జోన్ అలెగ్జాండర్ ఇప్పుడు యూనివర్సిటీ చరిత్రలోనే అత్యధిక వయసుతో డిగ్రీ పొందిన విద్యార్థిగా గుర్తింపు పొందారు. ఏది ఏమైనా ఈ వయస్సులో డిగ్రీ సాధించడడం అంటే అంత సులువు కాదు కదా..