Raghava Lawrence : దర్శకధీరుడు రాజమౌళి తీసిన విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు రవి రాథోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఓ సీన్ లో ‘రేయ్ సత్తి బాల్ ఒచ్చిందా అని ఓ పిల్లాడు రవితేజను అడుగుతాడు. హా ఆ పిల్లాడే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విక్రమార్కుడు తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. కానీ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో లారెన్స్ చేరదీసి ఓ స్కూల్ లో చేర్పించాడు. కానీ లారెన్స్ కు చెప్పకుండానే రవి రాథోడ్ అక్కడి నుంచి పారిపోయాడు. చదువు అబ్బలేదు. చిన్నా చితక పనులు చేసుకుంటూ మద్యానికి బానిస అయ్యాడు. దీంతో చాలా అనారోగ్య సమస్యలకు గురయ్యాడు. కిడ్నీలో రాళ్లు మరీ ఎక్కువ కావడంతో నడవలేని స్థితిలోకి వెళ్లిపోయాడు.
Read Also : Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్
రవి విషయం చాలా మీడియాల్లో వైరల్ అయింది. దీంతో లారెన్స్ ఈ విషయం తెలుసుకుని తనను ఒకసారి కలవమని కోరాడు. తనను ఆదుకున్న లారెన్స్ ను కలిసిన్నాడు రవి. మద్యానికి బానిస అయ్యాడని తెలిసి లారెన్స్ కోప్పడ్డాడు. లారెన్స్ కోసం ఇంకెప్పుడూ మద్యం ముట్టుకోను అని ప్రామిస్ చేసిన రవి.. అప్పటినుంచి మద్యానికి దూరంగానే ఉంటున్నాడు. లారెన్స్ ఇచ్చిన డబ్బులతోనే ఓ ఫోన్ కొనుక్కున్నాడు. ఇప్పుడు హెల్త్ కూడా సెట్ అవడంతో మరోసారి లారెన్స్ ను కలిసి ఆ ఫోన్ లోనే సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో లారెన్స్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఎంతో మందికి ఇలా సాయం చేస్తున్నాడని ఆయన్ను ప్రశంసిస్తున్నారు.
Read Also : Siddu Jonnalagadda : ఆ హీరోనే నా ఫేవరెట్.. తెలుగు హీరోలకు షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ