Auto Driver: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన అబ్దుల్ సామీ అనే ఆటో డ్రైవర్ కథ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇతడు ఓ సాధారణమైన వ్యక్తి. పెద్దగా చదువుకొనే అవకాశం రాకపోవడంతో, ఆటో డ్రైవింగ్ నేర్చుకుని ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. ఆర్థికంగా వెనుకబడిన సామీకి వ్యాపారాలూ, పెట్టుబడులూ అంటే తెలియవు. అతడికి తెలిసిందల్లా ఆటో నడపడమే. దాన్ని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా జీవన పోరాటం కొనసాగించాడు. కానీ, అతడి జీవితాన్ని మలుపు తిప్పిన ఓ స్మార్ట్ ఐడియా వల్ల ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఆ స్మార్ట్ ఆలోచన ఏంటో మనం కూడా ఒకసారి చూసేద్దామా..
Read Also: RCB Victory Parade: బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ.. స్వాగతం పలికిన కర్ణాటక డిప్యూటీ సీఎం
నిజానికి ఇతడి ఆదాయ మార్గం వింటే మాత్రం చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇతడు కేవలం న్యూఢిల్లీ లోని అమెరికా కాన్సులేట్ ఎదుట తన ఆటోను పార్క్ చేసి కూర్చుంటాడు అంతే. అయితే అక్కడ కాన్సులేట్ కు వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చే వాళ్లు తమతో తీసుకువచ్చిన లగేజీని లోపలికి తీసుకెళ్లడానికి సిబ్బంది అనుమతించారు. దీంతో ఆ లగేజీని బయట ఎక్కడ పెట్టాలో తెలియక తికమక పడుతున్న వారిని అతడు గమనించాడు.
ఇదే అవకాశాన్ని అదునుగా చేసుకున్న సామీ, తన ఆటోలో వారి బ్యాగులను ఉంచుకునేందుకు అవకాశం కల్పించాడు. అయితే, ఇక్కడే అసలు మ్యాటర్ ఉందండోయ్.. అదే ఆ లగేజ్ ను తన వద్ద సేఫ్ గా ఉంచేందుకు ఏకంగా ఒక్కొక్కరి వద్ద రూ.1000 ఛార్జీ వేయడం మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూకు వచ్చినవారు దూరం నుంచి వచ్చిన వారే కావడంతో, ఇంటర్వ్యూకు మిస్ కాకూడదన్న ఆలోచనతో చాలామంది ధర ఎక్కువైనా చెల్లించి లగేజీని అతడి ఆటోలో ఉంచుతున్నారు. ఇలా రోజుకి అతడి దెగ్గరికి 20 నుంచి 30 మంది వరకు కస్టమర్లు వస్తుంటారని సమాచారం.
Read Also: Allahabad High Court: ఆర్మీని కించపరిచేలా మాట్లాడే స్వేచ్ఛ ఎవరిచ్చారు.. రాహుల్ గాంధీపై కోర్టు ఆగ్రహం
ఇలా రోజు రోజుకి వ్యాపారం పెరుగుతూ ఉండడంతో అతడు ఆటో నడపడం మానేసి ఆ పనినే పూర్తి స్థాయిలో చేయడం మొదలు పెట్టాడు. ఇలా ఆయన నెలకు ఎంతలేదన్నా సుమారుగా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. ఈ విషయం అంత తాజాగా రాహుల్ రూపానీ అనే వ్యక్తి ద్వారా బయటకు వచ్చింది. అతడు వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో, తన లగేజీ తీసుకెళ్లేందుకు అక్కడి వారు అనుమతించకపోవడంతో అబ్దుల్ సామీ వద్ద ఉంచాడు.
అక్కడే ఇతరులూ బ్యాగులు ఉంచుకుంటుండడాన్ని గమనించి అతడిని ప్రశ్నించగా.. సామీ నిజాయితీగా తన “స్మార్ట్ ప్లాన్”ను వివరించడంతో, రాహుల్ ఈ కథను రెడ్డిట్ వేదికగా పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ అవడంతో సామీ పేరు ప్రస్తుతం నెట్టింట్లో మారుమోగిపోతోంది. ఈ కథను చదివిన నెటిజన్స్ సామీ స్మార్ట్ వర్క్ ను అభినందించకుండా ఉండలేకపోతన్నారు.