B. R. Gavai: “ఇది మా నాన్న కల.. కానీ చూడటానికి ఆయన లేరు..” కంటతడి పెట్టిన సీజేఐ..!
- నాగ్‌పూర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ
- సీజేఐ గవాయ్‌ను ఘనంగా సత్కరించిన బార్ అసోసియోషన్ సభ్యులు
- తల్లిదండ్రుల కృషి, పోరాట కథను వివరించిన ప్రధాన న్యాయమూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) భూషణ్ రామకృష్ణ గవాయ్ శుక్రవారం (జూన్ 27) జరిగిన ఓ కార్యక్రమంలో తన భావాలను పంచుకున్నారు. నాగ్‌పూర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలో అత్యున్నత న్యాయ పదవిని చేరుకున్నందుకు సీజేఐ గవాయ్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రుల కృషి, పోరాట కథను వివరించారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కళ్లు చెమ్మగిల్లాయి. గొంతు మూగబోయింది. భావోద్వేగపూరిత మాటలు విని, అక్కడ ఉన్నవాళ్లు కూడా విచారంగా మారారు. తాను చిన్నతనంలో ఆర్కిటెక్ట్ కావాలని కోరుకున్నానని తెలిపారు. కానీ తన తండ్రి న్యాయవాది కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ‘నా తండ్రి న్యాయవాది కావాలని కోరుకున్నారు. కానీ స్వాతంత్ర్య పోరాటంలో అరెస్టు కావడంతో ఆయన తన కలను నెరవేర్చుకోలేకపోయారని వెల్లడించారు.
READ MORE: Gautam Adani: పూరీ జగన్నాథుడి రథయాత్రలో అదానీ కుటుంబం..
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
తన కుటుంబం పడుతున్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. “మాది ఉమ్మడి కుటుంబం.. చాలా మంది పిల్లలు ఉండే వారు. బాధ్యత అంతా నా తల్లి, అత్త భుజాలపై ఉండేది. నా తండ్రి కలను నెరవేర్చడానికి.. ఆర్కిటెక్ట్ కావాలనే నా ఉద్దేశ్యాన్ని వదులుకుని, న్యాయవాద మార్గాన్ని ఎంచుకున్నాను. హైకోర్టు న్యాయమూర్తిగా నన్ను నియమించినప్పుడు.. ‘నువ్వు న్యాయవాదిగా కొనసాగితే, డబ్బు వెంట మాత్రమే పరిగెత్తుతారు. కానీ న్యాయమూర్తిగా మారితే.. అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరిస్తావు. సమాజానికి మంచి పని చేస్తావు’ అని నా తండ్రి చెప్పారు. నేను ఏదో ఒక రోజు భారత ప్రధాన న్యాయమూర్తి అవుతానని నా తండ్రి నమ్మాడు. అయితే, ఆయన 2015లో మరణించారు. ఈ రోజు ఆయన కల నెరవేరింది. కానీ ఇది చూసేందుకు ఆయన లేరు. నా తల్లి మాత్రం నా ఎదుగుదలను చూస్తున్నందుకు సంతోషిస్తున్నాను.” అని సీజేఐ భావోద్వేగానికి గురయ్యారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..