June Aviation Data: జూన్లో విమాన ప్రయాణీకుల సంఖ్య వార్షిక ప్రాతిపదికన సుమారు 18.8 శాతం పెరిగినట్లు జూన్లో దేశీయ విమాన ట్రాఫిక్కు సంబంధించిన డేటా ద్వారా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలియజేసింది.
బడ్జెట్ క్యారియర్గా పేరుపొందిన ఇండిగో.. ఎయిర్బస్తో బిగ్ డీల్ కుదుర్చుకుంది.. ఎయిర్ బస్ నుంచి ఏకంగా 500 విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఆర్డర్ను ఇస్తున్నట్లు ఈ రోజు ప్రకటించింది.
స్వచ్చంద దివాళా పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేట్ విమానయాన సంస్థ ‘గో ఎయిర్’ మరిన్ని కష్టాల్లో చిక్కుకుంది. ఈ నెల రెండో తేదీన ఎన్సీఎల్టీ వద్ద గోఫస్ట్ దివాళా పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే విమానాలు నేలకు పరిమితం కావడంతో గోఎయిర్ కెప్టెన్లుగా ఉన్న పైలట్లు, ఇతర సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ చేస్తున్నారు.
Women Pilots: భారతదేశంలో మొత్తం పైలెట్లలో 15 శాతం మహిళలే ఉన్నారు. ప్రపంచ సగటు కన్నా ఇది ఎక్కువ. ప్రపంచంలో మహిళా పైలెట్ల సగటు 5 శాతం మాత్రమే ఉంది. భారత దేశంలో మహిళా పైలెట్లు దీనికి మూడు రెట్లు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఎయిర్ ఆపరేటర్లలో 67 మంది విదేశీ పైలెట్లు పనిచేస్తున్నారని ఓ నివేదికలో వెల్లడైంది.
IndiGo Leaves Behind 37 Bags Of Passengers At Hyderabad Airport: ఎయిర్ లైన్స్ సంస్థలు అందిస్తున్న సేవల్లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఎయిరిండియాలో మూత్ర విసర్జన సంఘటన ఇండియా విమానయాన రంగంలో తీవ్ర ప్రకంపనలు రేపింది.
IndiGo Incident: ఇటీవల కాలంలో విమానయాన రంగంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. గత నెల వరకు ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన దేశ విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. దీంతో విమానాల్లో వికృతంగా ప్రవర్తించే ప్రయాణికుల పట్ల వ్యవహారించాల్సిన తీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలు విడుదల చేయాల్సి వచ్చింది. ఏయిరిండియా సంస్థ తన మద్యం పాలసీని సవరించుకుంది.