Passenger Misbehaves On IndiGo Flight: విమానంలో ఓ ప్రయాణికుడి వింత ప్రవర్తన సిబ్బందికి తలపోటుగా మారింది. విమానం గాల్లో ఉండగా.. టాయిలెట్‌లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో ఆదివారం చోటుచేయుకుంది. ప్రయాణికుడి విచిత్ర ప్రవర్తనను గమనించిన విమాన సిబ్బంది వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఫ్లైట్ పట్నా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన అనంతరం సదురు ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నుంచి పట్నాకు బయలుదేరిన ఇండిగో 6E 126 నంబర్ విమానంలో ఓ ప్రయాణికుడు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. టాయిలెట్‌లోకి వెళ్లి గడియ వేసుకోగా.. ప్రయాణికులు ఆందోళన చెందారు. ప్రయాణికుడి వింత ప్రవర్తన సిబ్బందికి పెద్ద తలపోటుగా మారింది. ఎంత పిలిచినా అతడు గడియ తీయలేదు. చివరకు పట్నా విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండ్ అయిన అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: MS Dhoni Hairstyle: ఎంఎస్ ధోనీ నయా హెయిర్ స్టైల్.. పోలా అదిరిపోలా..!
సదురు ప్రయాణికుడిని మొహ్మమద్ కమర్ రియాజ్‌గా విమానాశ్రయ సిబ్బంది గుర్తించారు. అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అదే విమానంలో ప్రయాణిస్తున్న అతడి సోదరుడు తెలిపాడు. ప్రస్తుతం రియాజ్ చికిత్స పొందుతున్నాడని, అతని హెల్త్ రిపోర్ట్స్‌ను అధికారులకు చూపించాడు. దాంతో సదురు ప్రయాణికుడిని మెంటల్ కండిషన్ బాగా లేదని నిర్ధారణకు వచ్చారు.