ISRO Chairman: ఇండిగో విమానం ఎక్కిన ఇస్రో చైర్మన్.. అక్కడి సిబ్బంది ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Cabin Crew Welcomes ISRO Chief S Somanath: ఆగస్ట్ 23 ప్రపంచ దేశాలకు భారత్ సత్తా తెలిసిన రోజు. అంతరిక్ష పరిశోధనల్లో ఇండియా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న రోజు. అగ్ర రాజ్యాలు కూడా ఇప్పటి వరకు వెళ్లని జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని భారత్ చంద్రయాన్-3 చేరిన రోజు. ఇక అప్పటి నుంచి భారత్ మాత్రమే కాకుండా భారత అంతరిక్ష సంస్థ పేరు కూడా మారుమ్రోగిపోయింది. ఇస్రో శాస్ర్తవేత్తలు ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిలో హీరోలు అయిపోయారు. కేవలం తమ పని తాము చేసుకుంటూ దేశం కోసం శ్రమిస్తూ కూడా అంత ఎక్కువగా ఎవరికీ తెలియని వారు ఒక్కసారిగా అందరికి తెలిసి ఫేమస్ అయిపోయారు. దీంతో ఎక్కడికి వెళ్లినా వారికి సాదర స్వాగతాలు లభిస్తున్నాయి. ప్రజలందరూ విశేష గౌరవాభిమానాలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ సోమ్ నాథ్ కు ప్రత్యేక గౌరవం దక్కింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Also Read: Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. రెండో రోజు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?
Also Read
- National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
- Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
- Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
ఇటీవల ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ పని మీద ఇండిగో విమానంలో ప్రయాణించారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులను దేశమంతా ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇండిగో కూడా సోమ్ నాథ్ తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చూపించింది. విమానం గాల్లోకి లేచే ముందు ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో ఆయనను గౌరవించారు. ఆయన తమ విమానంలో ప్రయాణించడాన్ని ఎంతో ప్రత్యేకంగా భావించిన ఇండిగో ఇలా తన అభిమానాన్ని చూపింది.
ఇక అనౌన్స్ మెంట్ లో ఇలా పేర్కొన్నారు. “”ఇవాళ ఈ విమానంలో ఓ విశిష్ట వ్యక్తి కూడా మనందరితో పాటు ఉన్నారు. మీరు (సోమ్ నాథ్) ఈ విమానంలో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తోంది ఇండిగో. మీకు సేవలు అందించే అవకాశం లభించడాన్ని మేం అదృష్టంగా భావిస్తున్నాం. మీరు దేశం గర్వించేలా చేశారు. మీకు ధన్యవాదాలు ” అంటూ గౌరవ వచనాలు పలికారు. అనౌన్స్ మెంట్ తరువాత విమానం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ఇక దీని తరువాత సోమ్ నాథ్ కు ఎయిర్ హోస్టెస్ ఫుడ్ అందిస్తూ, ఇండిగో తరుపున ప్రత్యేక గ్రీటింగ్ కార్డును కూడా అందజేశారు. తరువాత అక్కడ ఉన్న వారిలో చాలా మంది ఆయన ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
IndiGo की फ्लाइट में ISRO चीफ एस सोमनाथ का हुआ जोरदार स्वागत
◆ सभी ने कहा, “आप हमारे गर्व हैं सर”
ISRO | #Indigo pic.twitter.com/RKHFwA4P4J
— News24 (@news24tvchannel) August 31, 2023
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!