IndiGo Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Passenger Tries To Open Emergency Door on Delhi-Chennai IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
6E 6341 నంబర్ ఇండిగో విమానం మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరింది. మరికొద్దిసేపట్లో ఫ్లైట్ చెన్నైలో ల్యాండ్ అవుతుందనగా.. ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు భయపడిపోయారు. కొందరు గట్టిగా కేకలు కూడా వేశారట. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. విమాన సిబ్బంది అప్రమత్తతతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Also Read: World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఖాళీ స్టేడియంలోనే ప్రపంచకప్ మ్యాచ్!
ఇండిగో విమానం చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే.. ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) అధికారులకు అప్పగించారు. ఇండిగో అధికారులు సదరు వ్యక్తిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐఎస్‌ఎఫ్ విచారణ చేపట్టింది. ఆ వ్యక్తిని మణికందన్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!