IndiGo Flight: విమానంలో రక్తపు వాంతులు.. అత్యవసరంగా ల్యాండ్ అయిన ఇండిగో ఫ్లైట్! చివరికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
62 Years Old Flyer Vomits Blood On IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు 62 ఏళ్ల ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించాడు. ఈ ఘటన ముంబై నుంచి రాంచీ వెళుతున్న ఇండిగో (IndiGo Flight 6E 5093) విమానంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
62 ఏళ్ల ఓ ప్రయాణికుడు దీర్ఘకాలిక మూత్రపిండాలు మరియు క్షయ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నాడు. సోమవారం ఇండిగో విమానంలో రాంచీకి అతడు బయలుదేరాడు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అతడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఇది గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చి.. విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పుర్‌లో ల్యాండ్ చేశారు. వైద్య సహాయం కోసం అతడిని నాగ్‌పుర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
Also Read: Asia Cup 2023: అభిమానులకు శుభవార్త.. ఉచితంగానే ఆసియా కప్ మ్యాచ్‌లు చూడొచ్చు!
నాగ్‌పూర్‌లోని కిమ్స్ హాస్పిటల్ బ్రాండింగ్ మరియు కమ్యూనికేషన్స్ డీజీఎం ఏజాజ్ షమీ మాట్లాడుతూ… ‘ప్రయాణికుడిని కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడు అప్పటికే మరణించాడు. మృతదేహాన్ని తదుపరి ప్రక్రియల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు’ అని తెలిపారు. గత బుధవారం ఢిల్లీ-దోహా విమానంలో ప్రయాణీకుడిగా ప్రయాణిస్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ పైలట్ గుండెపోటుతో మరణించాడు. ఆ తర్వాత రోజు ఇండిగో కెప్టెన్ నాగ్‌పూర్‌లోని బోర్డింగ్ గేట్ వద్ద స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో మరణించాడు. అతను ఆ రోజు నాగ్‌పూర్ నుంచి పూణేకి విమానాన్ని నడపాల్సి ఉంది.
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!