భారత్-పాకిస్థాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు.
ప్రధాని మోడీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ప్రెస్‌మీట్‌కు ముందు ప్రధాని మోడీ.. సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, సైనిక అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు.
పాకిస్థాన్‌లోని కిరణా హిల్స్‌లో ఏముందో తమకు తెలియదని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. కిరణా హిల్స్ ఘటనపై మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.
నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) అధికారులతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారని సమాచారం. ఈ భేటీలో అణ్వాయుధాల నియంత్రణ, కార్యాచరణ నిర్ణయాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థతో ఆయన కీలక చర్చలు జరపనున్నారు.