ప్రధాని మోడీ సోమవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. మోడీ ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడతారా? లేదంటే ఇంకేమైనా కీలక ప్రకటన చేస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: AK Bharti: పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ పుకార్లు.. అక్కడ ఏముందో మాకు తెలీదు
ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధిపతులు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఉగ్రవాదులకు అండగా నిలిచిన పాకిస్థాన్‌కు భారత్ త్రివిధ దళాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. శత్రువుల నుంచి ఎలాంటి దాడులు ఎదురైనా తమ దళాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పాకిస్థాన్‌లోని కిరణా హిల్స్‌లో అణు కేంద్రం ధ్వంసం అయినట్లు వస్తున్న వార్తలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి భారత్ జరిపిన దాడుల్లో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది.
ఇది కూడా చదవండి: Balochistan: భారత్ సహకరిస్తే పాకిస్తాన్‌ని నిర్మూలిస్తాం.. బీఎల్ఏ సంచలనం..
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రమూకలు చెలరేగిపోయారు. మతం పేరుతో 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులంతా పాకిస్థాన్ కనుసన్నల్లోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా భారత్ భావించింది. దీంతో ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. అనుకున్న లక్ష్యాన్ని భారత్ సాధించింది.
ఇది కూడా చదవండి: Raghunandan Rao: దేశద్రోహులకు, కాంగ్రెస్‌కు ఉన్న సంబంధం బయటపడింది..
आकाशे शत्रुन् जहि I
Destroy the Enemy in the Sky.#PahalgamTerrorAttack #OperationSindoor#JusticeServed #IndianArmy@IAF_MCC @indiannavy pic.twitter.com/vO28RS0IdE
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 12, 2025