జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టగా.. మే 10న కాల్పుల విరమణ ప్రకటించాయి. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జమ్మూలోని అన్ని సరిహద్దు జిల్లాలు, అలాగే కాశ్మీర్ డివిజన్లలోని పాఠశాలలు మరియు కళాశాలలను రేపటి నుంచి తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Chhattisgarh: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. 20 మంది మావోల హతం
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది భారతీయులు చనిపోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా భారత్ దాడులకు తెగబడింది. ఈ దాడులతో పాకిస్థాన్ తీవ్ర పరిణామాలను చవిచూసింది. భారీగా నష్టపోయింది. మొత్తానికి మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రెస్‌మీట్‌కు ముందు సీనియర్ మంత్రులతో మోడీ కీలక సమావేశం
The Government has decided to re-open schools and colleges in all non-border districts of Jammu as well as Kashmir divisions from tomorrow, 13th of May, 2025. @CM_JnK @DDNewslive @airnewsalerts
— Information & PR, J&K (@diprjk) May 12, 2025