Operation Sindoor: ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచింది.. భారత్ డీజీఎంవో వెల్లడి
- ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచింది
- భారత్ డీజీఎంవో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచిందని భారత్ డీజీఎంవో పేర్కొంది. ఆపరేషన్ సిందూర్‌పై జాయింట్ మిలటరీ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ జరిగిందని పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం తమపై భారత్ దాడి చేస్తోందని భావించిందన్నారు. మన పోరాటం ఉగ్రవాదులపైనే అని తెలిపారు. పాకిస్థాన్ వివిధ రకాల డ్రోన్లు ప్రయోగించిందని భారత్ డీజీఎంవో స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: రాత్రి 8 గంటలకు మోడీ ప్రెస్‌మీట్.. సర్వత్రా ఉత్కంఠ
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాలు మార్చుకుంటున్నారని.. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసుకుంటున్నారని చెప్పారు. మే 9, 10 తేదీల్లో పాకిస్థాన్ మన వైమానికి స్థావరాలను చాలా టార్గెట్ చేసిందని.. కానీ మన డిఫెన్స్ వ్యవస్థతో వాటిని అడ్డుకున్నట్లు చెప్పుకొచ్చారు. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని పాకిస్థాన్ మన వైమానికి స్థావరాలను ధ్వంసం చేయలేకపోయిందని.. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం పాకిస్థాన్‌ను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ram Charan : చరణ్ మైనపు విగ్రహంతో చిరంజీవి ఫ్యామిలీ..
‘‘పాకిస్తాన్ వివిధ రకాల డ్రోన్లను వినియోగించింది. దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం వాటిని అడ్డుకున్నాం.. ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాం. చైనా తయారు చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాక్ దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశాం. పాక్‌లోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ రన్‌వేకు తీవ్రనష్టం జరిగింది.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్నారు.
‘‘దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు. శత్రువుల విమానాలను మన దేశంలోకి రాకుండా అడ్డుకున్నాం. మన అన్ని సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి ఆపరేషన్‌కు అయినా మేం సన్నద్ధంగా ఉన్నాం. పాక్‌కు జరిగిన డ్యామేజీ ఆ దేశం చెప్పుకోవడం లేదు.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు.
आकाशे शत्रुन् जहि I
Destroy the Enemy in the Sky.#PahalgamTerrorAttack #OperationSindoor#JusticeServed #IndianArmy@IAF_MCC @indiannavy pic.twitter.com/vO28RS0IdE
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 12, 2025

తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!