భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 కోసం అంపైర్ల జాబితాను ప్రకటించింది. ఈసారి ఐపీఎల్‌లో ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లు తొలిసారి అధికారికంగా అంపైరింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు.. సీనియర్ అంపైర్లు కుమార్ ధర్మసేన, అనిల్ చౌదరి ఈ సీజన్‌లో కనిపించరు.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాకపోయినా.. తన ప్రదర్శనపై దృష్టి సారించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆర్సీబీ జట్టులో 7 సంవత్సరాల పాటు ఆడిన ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. తన కొత్త జట్టుకు మెరుగైన ప్రదర్శన అందించేందుకు రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత సిరాజ్ ఐపీఎల్ 2025 సీజన్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తడబడుతోంది. ఇటీవలే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, అంతకుముందు టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత్.. టెస్ట్ క్రికెట్‌లో విఫలమవుతుంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టెస్ట్ క్రికెట్‌లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మార్పులకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని గంగూలీ చెప్పారు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో ఇంకా మెరుగ్గా ఆడగలడని అన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వన్డే ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్కొక్క స్థానం మెరుగుపరచుకున్నారు. కోహ్లీ మళ్ళీ టాప్-5లోకి చేరాడు. 743 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు.
అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించినట్లయితే అతని పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయ్యేవి. ఐసీసీ వన్డే టోర్నమెంట్లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన మొదటి స్పిన్నర్‌గా అక్షర్ నిలిచేవాడు. అంతేకాకుండా.. ఐసీసీ టోర్నమెంట్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డులకెక్కే వాడు. ఇప్పటివరకు ఐసీసీ ఈవెంట్లలో ఏ భారత స్పిన్నర్ హ్యాట్రిక్ సాధించలేదు.
భారత జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక గొప్ప ఘనత సాధించాడు. "హిట్‌మ్యాన్" గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ, వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4 వేల రన్స్ పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు.
ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత్.. మూడో మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
హిట్ మ్యాన్‌గా పేరొందిన రోహిత్ శర్మకు ఏమైంది.. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పటి నుండి అతను సరిగా ఆడటం లేదు.. దీంతో.. తన బ్యాట్‌కు ఏదో ఒక శాపం తగిలి ఉంటుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర నిరాశ పరిచిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రంజీలో ఆడాడు. అక్కడ కూడా ఇదే రకమైన ప్రదర్శన కనబరిచాడు.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ కు సిద్ధమవుతుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంది. టీ20 సిరీస్‌లో అద్భుతంగా ప్రదర్శించిన 'మిస్టరీ స్పిన్నర్' వరుణ్ చక్రవర్తి.. భారత వన్డే జట్టులో చేరాడు.