ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్రారంభమైంది. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్.. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 8 జట్లతో మొదలైన ఈ లీగ్ లో ప్రస్తుతం పది టీమ్స్ ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి మరో రికార్టు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో విరాట్ 400వ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇప్పటికే ఈ రికార్డులో రోహిత్ శర్మ (448 మ్యాచ్‌లు), దినేష్ కార్తీక్ (412 మ్యాచ్‌లు) ఉన్నారు. ఇప్పుడు విరాట్ మూడో స్థానికి చేరుకున్నాడు.
READ MORE: World Famous Sport : ప్రపంచంలో అత్యధిక అభిమానులు ఉన్న క్రీడ ఏదో మీకు తెలుసా..?
ఐపీఎల్ మొదటి సీజన్ 2008లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అదే ఏడాది విరాట్ కోహ్లీ టీ20లోకి అడుగు పెట్టాడు. 382 ఇన్నింగ్స్‌ల్లో 41.43 సగటుతో 12,886 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 97 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇప్పటికే విరాట్ పేరిట పలు రికార్డులు ఉన్నాయి. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అంతే కాకుండా… ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.
READ MORE: Disha Salian case: ‘‘దిశా సాలియన్ మృతిలో ఆదిత్య పేరు తీసుకురావద్దని ఉద్ధవ్ ఠాక్రే కోరాడు..’’
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2025 ఆరంభ వేడుకలు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా వేదికపై బాలీవుడ్ నటుడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పులేశారు. వారిద్దరి డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.