ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ప్రతిభను చాటారు. ముఖ్యంగా టీ20, వన్డే ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు, బౌలర్లు అగ్రస్థానాలను సాధించారు. టీ20 బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో భారత బ్యాటర్లు ముగ్గురు నిలిచారు. ఇందులో యువ ఆటగాడు అభిషేక్ శర్మ 829 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా, తిలక్ వర్మ 804 పాయింట్లతో నాలుగో స్థానం, సూర్యకుమార్ యాదవ్ 739 పాయింట్లతో ఐదో స్థానంలో…
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) రాబోయే సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ఖరారు చేయడానికి.. భవిష్యత్ టెస్ట్ కెప్టెన్ను ఎంపిక చేసేందుకు కీలకమైన సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాల్గొననున్నారు.
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టులో చోటు లభించకపోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని.. కానీ జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్నానని సిరాజ్ తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్రారంభమైంది. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్.. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 8 జట్లతో మొదలైన ఈ లీగ్ లో ప్రస్తుతం పది టీమ్స్ ఉన్నాయి. మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి మరో రికార్టు సృష్టించాడు. టీ20 క్రికెట్లో విరాట్ 400వ మ్యాచ్ ఆడుతున్నాడు.…
ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎస్ఆర్ఎంబీ స్టీల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యాడు. ప్రపంచ కప్ విజేత దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, ఎమ్ఎస్ ధోనిలతో ఎలైట్ లీగ్లో చేరాడు. ఈ నేపథ్యంలో కొత్త బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ.. కపిల్, ధోనీలతో కలిసి ఓ యాడ్ రూపొందించారు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 కోసం అంపైర్ల జాబితాను ప్రకటించింది. ఈసారి ఐపీఎల్లో ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లు తొలిసారి అధికారికంగా అంపైరింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు.. సీనియర్ అంపైర్లు కుమార్ ధర్మసేన, అనిల్ చౌదరి ఈ సీజన్లో కనిపించరు.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాకపోయినా.. తన ప్రదర్శనపై దృష్టి సారించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆర్సీబీ జట్టులో 7 సంవత్సరాల పాటు ఆడిన ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. తన కొత్త జట్టుకు మెరుగైన ప్రదర్శన అందించేందుకు రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత సిరాజ్ ఐపీఎల్ 2025 సీజన్లోకి అడుగుపెట్టనున్నాడు.
టెస్ట్ క్రికెట్లో టీమిండియా తడబడుతోంది. ఇటీవలే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, అంతకుముందు టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత్.. టెస్ట్ క్రికెట్లో విఫలమవుతుంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టెస్ట్ క్రికెట్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మార్పులకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని గంగూలీ చెప్పారు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్లో ఇంకా మెరుగ్గా ఆడగలడని అన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వన్డే ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజా ర్యాంకింగ్స్లో ఒక్కొక్క స్థానం మెరుగుపరచుకున్నారు. కోహ్లీ మళ్ళీ టాప్-5లోకి చేరాడు. 743 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు.