ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నుండి ప్రారంభమవుతుంది. చాలా రోజుల తర్వాత జట్టులోకి అడుగుపెట్టిన మహమ్మద్ షమీకి కూడా వన్డే సిరీస్‌లో అవకాశం లభించింది. కాగా.. మొదటి వన్డే నాగ్‌పూర్‌లో జరుగనుంది.. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు.. సిక్సులతోనే డీల్ చేశాడు.
అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. 114 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 30 బంతులు ఉండగానే విజయం సాధించింది. దీంతో.. ఇంగ్లాండ్ పై గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టింది భారత మహిళల జట్టు.
Virat Kohli: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024-25 ఎలైట్ గ్రూప్ D మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రైల్వేస్‌తో ఆడుతున్నాడు. 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఢిల్లీ స్టేడియంకు చేరుకున్నారు. జనవరి 30, మొదటి రోజు ఆట ఉదయం సెషన్లో ఒక అభిమాని భద్రతా వలయాన్ని దాటుకొని మైదానం మధ్యలోకి చేరుకుని విరాట్ కోహ్లీ పాదాలను తాకాడు. ఇందుకు…
Wriddhiman Saha: భారతదేశ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడైన వృద్ధిమాన్ సాహా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకబోతున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 ఏడో రౌండ్ తర్వాత సాహా ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. గత ఏడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సాహా, అప్పట్లోనే ఈ రంజీ సీజన్ తన చివరిది అని తెలిపాడు. బెంగాల్ జట్టు ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో సాలిడ్ ప్రదర్శన చేయలేకపోయింది. 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క…
Rohit Sharma: ప్రస్తుతం ఫామ్ కోసం తెగ కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టెస్టు, వన్డేల్లో టీమిండియా సారథిగా ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ టోర్నీలో టీమిండియా ప్రదర్శన నిరాశజనకంగా ఉండటంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఆటతీరు తగ్గిందని, క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.…
Tilak Varma: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ ఆటగాడు తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్లో ఒక కొత్త రికార్డు సృష్టించాడు. తిలక్ ఇటీవల తన ఆటతీరుతో భారత అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో తిలక్ ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు. ఇది ఒక బాట్స్మెన్ రెండు ఔట్స్ మధ్యలో చేసిన అత్యధిక పరుగులుగా ప్రపంచ రికార్డుగా నిలిచింది. దక్షిణాఫ్రికా…
Maha Kumbh Mela 2025: ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోల్‌కతాలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించగా.. నేడు చెన్నై వేదికగా రెండో టి20 మ్యాచ్ జరుగునుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో టీమిండియాకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. Also Read: IND…
India vs Malaysia: అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ కౌలాలంపూర్‌లోని బ్యుమాస్ ఓవల్‌లో జరిగింది. మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కేవలం 17 బంతుల్లోనే 10 వికెట్ల తేడాతో మలేషియాపై టీమిండియా విజయం సాధించింది. మలేషియా జట్టు కేవలం 14.3 ఓవర్లలో 31 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తరపున వైష్ణవి శర్మ కేవలం 5 పరుగులిచ్చి 5…
Kapil Dev: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, టీమిండియా మాజీ ఆటగాడు యోగ్రాజ్ సింగ్ మధ్య పాత వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది. యోగ్రాజ్ సింగ్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై కపిల్ దేవ్ ఇచ్చిన స్పందన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో యోగ్రాజ్ సింగ్, కపిల్ దేవ్ తనను జట్టు నుండి అన్యాయంగా తొలగించారని ఆరోపించారు. ఈ విషయంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. “కౌన్ హైన్?”…