ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం జులై 6, 7వ తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. దీంతో ఈ సీజన్లో తాను ఎలాగైనా ఆడాలని చెప్పి తన పేరును కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎందుకంటే గత సీజన్లో ఆరు జట్లు మాత్రమే తలపడ్డాయి. కానీ, ఈ సీజన్లో మరో రెండు జట్లు కొత్తగా వచ్చి చేరాయి. దీంతో ఈ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరింత రసవత్తరంగా సాగనుంది.
ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్ జైస్వాల్ ఇంగ్లాండ్ గడ్డపై 144 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
Gautam Gambhir: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లతో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్టార్ బ్యాటర్లు వన్డే ఫార్మెట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఫిట్నెస్ సహకరిస్తే వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారు. వారిద్దరిని ఎలాగైనా 2027 ప్రపంచ కప్ లో ఆడించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. Read Also: Miss World 2025: తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు..! కానీ, అక్కడ గంభీర్ ఉండగా అది సాధ్యపడేలా…
రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. టీం ఇండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ భారత టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్‌గా ఉండటానికి అనువైన ప్లేయర్లు అని అభిప్రాయపడ్డారు. వారి వయసును పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఐపీఎల్ జట్లకు కెప్టెన్లుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.…
ఐపీఎల్ 2025 శనివారం నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ పర్యటనకు ఇండియా ఎ జట్టును ప్రకటించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి మే 16 (శుక్రవారం)న జట్టును ప్రకటించింది. ఈ పర్యటనలో ఇండియా-ఎ జట్టుకు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కరుణ్ నాయర్, ఇషాన్ కిషన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. దేశీయ క్రికెట్లో మంచి ప్రదర్శన ఇచ్చినందుకు కరుణ్ నాయర్‌కు గిఫ్ట్ లభించింది. ఇషాన్ కిషన్ కూడా భారత జట్టు సెటప్‌లోకి…
Womens Squad Team : లండన్ టూర్ కు వుమెన్స్ క్రికెట్ టీమ్ రెడీ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమ్ ను పవర్ ఫుల్ గా సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఈ సారి మరింత గట్టిగా కొట్టేందుకు టీమ్ ను సెలెక్ట్ చేశామని బీసీసీఐ పోస్ట్ చేసింది. లండన్ తో టీ20, వన్డే క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు ఈ టీమ్ వెళ్లబోతోంది. వన్డే మ్యాచ్ ల కోసం హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్, స్మృతి…
End Of RO-KO Era: నేటితో భారత టెస్ట్ క్రికెట్లో ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు. దీనికి కారణం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడమే. మే 7న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు తెలపగా, నేడు విరాట్ కోహ్లీ కూడా సైనింగ్ ఆఫ్.. అంటూ సోషల్ మీడియా వేదికాగా భారత టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టీమిండియాను నడిపించిన ఇద్దరు దిగ్గజాలు వారంలోపే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించడంతో…
Virat Kohli: విరాట్ కోహ్లీ.. పేరుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచానికి. అంతర్జాతీయ వేదికలపై వేలకొద్ది పరుగులు, ఎప్పుడు మైదానంలో అగ్రెసివ్ గా కనిపించే ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ గత ఏడాది టీమిండియా అంతర్జాతీయ టి20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి విధితమే. కోహ్లీ ఈ నిర్ణయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే ఆల్ రౌండర్ రవీంద్ర జెడేజాలు కూడా…
జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్లోని బైసరన్‌లో మంగళవారం హృదయ విదారక ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటి వరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆ బృందం సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది.
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.