భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 కోసం అంపైర్ల జాబితాను ప్రకటించింది. ఈసారి ఐపీఎల్‌లో ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లు తొలిసారి అధికారికంగా అంపైరింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు.. సీనియర్ అంపైర్లు కుమార్ ధర్మసేన, అనిల్ చౌదరి ఈ సీజన్‌లో కనిపించరు. అనిల్ చౌదరి అంపైరింగ్‌కు వీడ్కోలు పలికి వ్యాఖ్యాతగా మారనున్నారు. అయితే.. ధర్మసేన ఈసారి ఎందుకు లేరు అనే విషయం పై స్పష్టమైన సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ఈ ఇద్దరి స్థానాలను భర్తీ చేసేందుకు మైఖేల్ గోఫ్, క్రిస్ గాఫ్నీ, అడ్రియన్ హోల్డ్‌స్టాక్ వంటి అంతర్జాతీయ అంపైర్లు బాధ్యతలు తీసుకోనున్నారు.
Read Also: Rajitha: సీనియర్ నటి ఇంట తీవ్ర విషాదం
కొత్తగా ఎంపికైన ఏడుగురు భారతీయ అంపైర్లు:
బీసీసీఐ ఈసారి కొత్తగా ఏడుగురు భారతీయ అంపైర్లను ఎంపిక చేసింది. వీరిలో…
స్వరూప్‌నంద్ కన్నూర్
అభిజిత్ భట్టాచార్య
పరాశర్ జోషి
అనిష్ సహస్రబుద్ధే
కేయూర్ కేల్కర్
కౌశిక్ గాంధీ
అభిజీత్ బెంగర్
ఈ కొత్త అంపైర్లందరూ అనుభవజ్ఞులైన ఎస్. రవి, సికె నందన్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందారు. మరోవైపు.. UPCA ఇటీవల తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించింది.
అనిల్ చౌదరి- 17 సీజన్ల అంపైరింగ్‌కు వీడ్కోలు:
అనిల్ చౌదరి 2008 నుండి 2024 వరకు 17 సీజన్ల పాటు ఐపీఎల్‌లో అంపైరింగ్ చేశారు. 60 ఏళ్ల అనిల్ చౌదరి ఈసారి కొత్త పాత్రలో టీవీ వ్యాఖ్యాతగా మారనున్నారు. ఈ నిర్ణయం వల్ల అంపైర్‌గా ఆయన పూర్తిగా రిటైర్ అయ్యారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.