Mohammed Siraj: ఐపీఎల్ పైనే ఫోకస్.. అవేమీ ఆలోచించను
- ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు సెలక్ట్ కాని మహమ్మద్ సిరాజ్
- తన ప్రదర్శనపై దృష్టి సారిస్తున్న స్టార్ బౌలర్
- ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి
- కొత్త జట్టుకు మెరుగైన ప్రదర్శన అందించేందుకు రంగంలోకి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాకపోయినా.. తన ప్రదర్శనపై దృష్టి సారించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆర్సీబీ జట్టులో 7 సంవత్సరాల పాటు ఆడిన ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. తన కొత్త జట్టుకు మెరుగైన ప్రదర్శన అందించేందుకు రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత సిరాజ్ ఐపీఎల్ 2025 సీజన్‌లోకి అడుగుపెట్టనున్నాడు. జూన్ 20 నుండి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటన.. సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌కు ముందు టీమిండియాలో స్థానం సంపాదించడం కోసం ఐపీఎల్ ఆదర్శంగా ఉంటుందని సిరాజ్ తెలిపాడు. ఈ సీజన్‌లో తన కొత్త ఫ్రాంచైజీకి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి పెడుతానని అన్నాడు.
Read Also: Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మద్యం కోసం భార్యను హత్య చేసిన భర్త
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
సిరాజ్ తన ఎంపికపై స్పందిస్తూ.. “సెలెక్షన్ నా చేతుల్లో లేదు, నా చేతుల్లో కేవలం బాల్ మాత్రమే ఉంది. నేను ఏదైనా చేయాలనుకుంటే దాంతోనే చేయాలి. ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి, నాపై నేను ఒత్తిడి పెంచుకోలేను” అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం సిరాజ్.. తన ఫిట్‌నెస్, బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి విరామ సమయంలో కృషి చేశాడు. హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని.. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ మరింత ప్రభావవంతంగా బౌలింగ్ చేయడంపై దృష్టిపెట్టాడు.
Read Also: Ranbir Kapoor : ఆమెనే నా మొదటి భార్య.. బాంబు పేల్చిన రణ్‌బీర్
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌లో మహమ్మద్ సిరాజ్.. కగిసో రబడ, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, గెరాల్డ్ కోయెట్జీలతో కూడిన బలమైన పేస్ అటాక్‌లో చేరనున్నాడు. షమీ స్థానంలో రావడం గురించి సిరాజ్ మాట్లాడుతూ.. భారత్, గుజరాత్ టైటాన్స్ రెండింటికీ అతను అందించిన సహకారాన్ని ప్రశంసించాడు. “షమీ భాయ్ టీమిండియా, గుజరాత్ టైటాన్స్ కోసం చాలా చేసాడు. అతని మణికట్టు, సీమ్ పొజిషన్‌తో పాటు స్వింగ్‌ను సృష్టించే సామర్థ్యం సాటిలేనిది” అని సిరాజ్ అన్నాడు. ” నా పని కూడా జట్టుకు వికెట్లు అందించడమే. నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది.” అని సిరాజ్ మియా తెలిపాడు. కాగా.. గుజరాత్ టైటాన్స్ తమ మొదటి మ్యాచ్ మార్చి 25 (మంగళవారం) అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..