భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారుల మధ్య గౌహతిలో ఈ రోజు జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పాల్గొంటారని భావించారు. IANS నివేదిక ప్రకారం.. సమావేశం వాయిదా విషయాన్ని శుక్రవారం రాత్రే సంబంధిత పార్టీలకు తెలియజేశారు. అసలు షెడ్యూల్ ప్రకారం.. అజిత్ అగార్కర్ శనివారం గౌహతికి చేరుకుని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియాతో చర్చించాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది.
Read Also: Abhinaya : పెళ్లి పీటలెక్కుతున్న నటి అభినయ.. వరుడు ఎవరో తెలుసా..?
ప్రస్తుతం ఈ సమావేశం కొత్త తేదీపై స్పష్టత లేదు. గౌహతిలో రెండవ ఐపీఎల్ మ్యాచ్ తర్వాత లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశముందని సమాచారం. బీసీసీఐ వర్గాల ప్రకారం.. భవిష్యత్తులో జరిగే ఈ సమావేశం వివరాలను త్వరలో వెల్లడిస్తారని తెలిపారు. ఈ చర్చలో ప్రధానంగా చర్చించే అంశాలలో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో.. భారత A జట్టుకు సంబంధించిన ఒప్పందాలు, సీనియర్ జట్టు ఎంపిక & ఇంగ్లాండ్ పర్యటన ప్రణాళిక అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Annamayya District: అమానుషం.. 9 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్
మరోవైపు.. ఈ సమావేశానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యే అవకాశముందని సమాచారం. గంభీర్ ప్రస్తుతం తన కుటుంబంతో విదేశాల్లో సెలవులు గడుపుతున్నాడు. అయితే.. రాబోయే క్రికెట్ సీజన్ కోసం అతను మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నాడు. ఈ సమావేశంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ గురించి చర్చించనున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఆటగాళ్లు A+ గ్రేడ్‌లో ఉన్నారు. అయితే.. టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత వీరి గ్రేడ్‌లో మార్పు ఉండొచ్చని భావిస్తున్నారు. 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఎంఎస్ ధోని A+ గ్రేడ్‌లో కొనసాగిన విషయం తెలిసిందే. దీనిపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.