Sourav Ganguly: మరోసారి సౌరవ్ గంగూలీ పోటీ.. ఈసారి కూడా ఏకగ్రీవమేనా!
- మరోసారి సౌరవ్ గంగూలీ పోటీ
- క్యాబ్ అధ్యక్ష పదవికి దాదా పోటీ
- గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికవుతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly to Contest for CAB President Again: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి భారత క్రికెట్ బోర్డులో తన ప్రభావం చూపడానికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవికి దాదా పోటీ చేస్తున్నారని సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో క్యాబ్ అధ్యక్ష పదవికి గంగూలీ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబ్ ఎన్నికల్లో దాదా ఏకగ్రీవంగా ఎన్నికవుతాడా? లేదా పోటీ ఎదుర్కొంటాడా? అనేది చూడాలి.
సౌరవ్ గంగూలీ తన రిటైర్మెంట్ అనంతరం 2014లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. క్యాబ్‌లో దాదా తన మార్క్ చూపించారు. దాంతో 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐపై ఈ బెంగాల్ టైగర్ తనదైన ముద్ర వేశారు. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం.. మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తప్పనిసరి. కాబట్టి గంగూలీ ప్రస్తుతం ఏ పదవిలో లేరు. 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ ఇప్పుడు బీసీసీఐ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నారు.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
Also Read: Sourav Ganguly: భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదు.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!
52 ఏళ్ల సౌరవ్ గంగూలీ ఇప్పుడు మరలా క్రీడా పరిపాలనలో అడుగుపెపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబ్ అధ్యక్ష పదవికి దాదా పోటీ పడటం ఖాయమే అని సమాచారం. ప్రస్తుతం గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆరేళ్లుగా పదవిలో కొనసాగుతుండటంతో.. మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే దాదా క్యాబ్ అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?