Team India Opening Pair: ఆసియా కప్-2025 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కూడిన జట్టును ఇవాళ ( ఆగస్టు 19న) ప్రకటించింది. ఇక, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. ఆసియా కప్ ఆడబోయే టీమిండియా జట్టులోని సభ్యుల పేర్లు తెలిపారు. కాగా, ఈ ఖండాంతర టోర్నమెంట్ తో టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. భారత జట్టు తరఫున టీ20లలో పునరాగమనం చేయబోతున్నాడు.
Read Also: Karnataka: 13 ఏళ్ల బాలుడిపై 48 ఏళ్ల టీచర్ లైంగిక దాడి.. పోక్సో చట్టంపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు!
టీమిండియా ఓపెనింగ్ జోడీ..?
అయితే, ఆసియా కప్‌లో భారత జట్టు ఓపెనింగ్ జోడీ ఎవరన్న ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా గిల్ ఉండగా.. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాడు. కానీ, ప్రస్తుతం జట్టులో సంజూకు చోటు లభించినా.. గిల్ రాకతో ఓపెనర్‌గా అతడిపై వేటు పడేలా కనిపిస్తోంది. కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే అతడి పేరును పరిశీలనలోకి తీసుకుంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేయడంతో సంజూకు కాస్త ఉపశమనం లభించినట్లు అయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read Also: Ukraine map change: ఉక్రెయిన్ మ్యాప్ మారబోతుందా..? వైట్ హౌస్ మీటింగ్‌లో ఏం జరిగింది..
గిల్ లేడు కాబట్టే సంజూకు ఛాన్స్..
ఇక, తాజా, పరిణామాలతో ఆసియా కప్-2025లో భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లేరు కాబట్టి అప్పుడు సంజూ శాంసన్ ఓపెనర్‌గా వచ్చాడు.. అలాగే, అభిషేక్ శర్మ కూడా! అని తెలిపాడు. కాగా, ఓపెనర్‌గా అభిషేక్ అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గానూ పనికి వస్తాడని పేర్కొన్నాడు. ఇక, అభిషేక్ శర్మకు జోడీగా ఇప్పుడు ఇద్దరు ఓపెనర్లు బరిలో ఉన్నారని వెల్లడించారు.
Read Also: Kukatpally Minor Girl Murder : కూకట్‌పల్లిలో మైనర్ బాలిక హత్య.. కీలక పరిణామాలు వెలుగులోకి
అక్కడే తుది నిర్ణయం..
శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్.. ఈ ఇద్దరూ మంచి ఓపెనింగ్ బ్యాటర్లు. అయితే, దుబాయ్‌లో ఓపెనర్‌గా ఎవరు వస్తారని అక్కడే నిర్ణయిస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలియజేశారు. గిల్ అంతకు ముందు కూడా వైస్ కెప్టెన్‌గా తుది జట్టులో ఉన్నారు.. ఇప్పుడు తిరిగి రావడంతో ఎలాంటి సమస్య లేదన్నారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మను మొదటి ప్రాధాన్య ఓపెనర్‌గా చెప్పిన అగార్కర్.. గిల్ రాకతో సంజూపై ఓపెనర్‌గా వేటు పడక తప్పదనే సంకేతాలను ఇవ్వకనే ఇచ్చాడని చెప్పాలి. అయితే, ఆసియా కప్-2025కి ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లకు స్థానం లభించలేదు. దీంతో సెలక్టర్ల తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.