HBD Sourav Ganguly: భారత క్రికెట్‌లో “దాదా” అనగానే గుర్తొచ్చే పేరు సౌరవ్ గంగూలీ. భారత జట్టును విదేశీ గడ్డపై గెలవడం ఎలా అనే విషయాన్ని నేర్పించిన నాయకుడు. భారత్ అంటే ఇంట్లోనే జైత్రయాత్ర చేసే జట్టు.. అనే ముద్రను తొలగించిన కెప్టెన్. జూలై 8, 1972న కోలకతాలో జన్మించిన గంగూలీ నేడు 54వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విశేషాలను గుర్తు చేసుకుందాము.
సౌరవ్ గంగూలీ.. 1997లో వరుసగా నాలుగు వన్డే మ్యాచ్‌ల్లో “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు గెలుచుకున్న ఏకైక ఆటగాడుగా రికార్డ్ సృష్టించాడు. అలాగే వరుసగా నాలుగు సంవత్సరాల్లో సంవత్సరాల్లో 1000+ పరుగులు సాధించిన రికార్డ్ సృష్టించాడు. 1997 నుండి 2000 వరకు వరుసగా నాలుగేళ్లూ 1000కి పైగా పరుగులు చేశాడు. ఈ నాలుగు సంవత్సరాల్లో 1997లో 1338, 1998లో 1328, 1999లో 1767, 2000లో 1579 పరుగులు చేసారు.
Read Also:Texas Floods: 104కి చేరిన టెక్సాస్ వరద మృతుల సంఖ్య.. కుటుంబాలకు కుటుంబాలే మృత్యువాత
తన వన్డే కెరీర్‌లో గంగూలీ 11,363 పరుగులు చేశాడు. భారత లెఫ్ట్ హ్యాండెడ్ ఆటగాళ్లలో ఇది రికార్డు. ప్రపంచ స్థాయిలో కుమార్ సంగక్కర (14,234), జయసూర్యా (13,430) తరువాత మూడవ స్థానంలో గంగూలీ ఉన్నాడు. అలాగే వన్డేల్లో 10,000+ పరుగులు, 100+ వికెట్లు సాధించిన ప్రపంచంలో కేవలం ఆరుగురిలో ఒకడిగా గంగూలీ ఉన్నారు. తన 22 వన్డే శతకాలలో 18 శతకాలు విదేశాలలో చేసినవే. ఇది విదేశాల్లో అతడి స్థిరతను తెలుపుతుంది.

ఐసీసీ వన్డే టోర్నీల నాకౌట్ మ్యాచ్‌ల్లో మూడు శతకాలు చేసిన ఆటగాళ్లలో గంగూలీ ఒకడు. ఆయనతోపాటు ఈ లిస్ట్ లో రికీ పాంటింగ్, సయద్ అన్వర్ లు ఉన్నారు. 2000లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గంగూలీ 117 పరుగులు చేశాడు. ఇక సచిన్ – గంగూలీ జోడీ వన్డేల్లో 176 ఇన్నింగ్స్‌ల్లో 8227 పరుగులు చేసింది.. ఇది ఇప్పటికీ రికార్డ్ కొనసాగుతూనే ఉంది. 1999 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై గంగూలీ చేసిన 183 పరుగులు. ఇప్పటికీ ప్రపంచకప్‌లో భారత ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2007లో పాకిస్తాన్‌పై 239 పరుగులు చేసాడు లెఫ్ట్ హ్యాండెడ్ ఆటగాడు గంగూలీ. ఈ రికార్డు ఇంకా ఎవరూ బ్రేక్ చేయలేదు.
Read Also:Father Abuse on Daughters: తండ్రి కాదు కామ పిశాచి.. ఐదుగురు కూతుర్లపై అత్యాచారం.. వీడియో వైరల్..!
ఇవ్వన్నీ ఒకెత్తు అయితే ఆయన కెరియర్ చివరిలో అనేక ఇబ్బందులు పదలిసి వచ్చింది. అలా గంగూలీ తన కెరియర్ ను ముగించిన తర్వాత కొంతకాలం బీసీసీఐ చైర్మైన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పోస్ట్ కు రాజీనామా చేశారు.