Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌ను పక్కన పెట్టిన బీసీసీఐ.. ఎందుకింత వివక్ష..?
- ఆసియా కప్ భారత్ టీమ్ను ప్రకటించిన బీసీసీఐ..
- సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్-2025..
- మరోసారి శ్రేయస్ అయ్యర్‌కు ఛాన్స్ ఇవ్వని బీసీసీఐ..
- శ్రేయస్ పట్ల బీసీసీఐ తీరుపై మండిపడితున్న అభిమానులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer: బీసీసీఐ తీరుపై టీమిండియా క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్షపాత ధోరణి వీడాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025కి ఇవాళ (ఆగస్టు 19న) బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ టీంకు సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టు సారథిగా కొనసాగించగా.. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను తప్పించి.. శుబ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది.
Read Also: Dharma Mahesh: టాలీవుడ్ హీరోపై వరకట్నం కేసు?
Also Read
- India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
అయితే, టీమిండియా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ మరోసారి మొండిచేయి చూపింది. 15 మంది సభ్యులతో కూడిన ఆసియా కప్ జట్టులో ఈ ముంబై బ్యాటర్‌ను పక్కకు పెట్టింది. అలాగే, కనీసం స్టాండ్ బై ప్లేయర్ల లిస్టులోనూ శ్రేయస్ కు బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అయ్యర్ అభిమానులు సెలక్షన్ కమిటీపై తీవ్రంగా మండిపడుతున్నారు. శ్రేయస్ పట్ల బీసీసీఐ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కొంతమంది అభిమానులు ఆరోపిస్తుండగా, ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు పోషించిన కీలక పాత్రను గుర్తుచేస్తున్నారు.
Read Also: NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ క్యాన్సిల్?
కాగా, గతంలో ఈ ముంబై బ్యాటర్ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడని అతడ్ని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి కూడా బీసీసీఐ తప్పించింది. ఇక, మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకుని.. 2024లో ముంబై రంజీ ట్రోఫీ టైటిల్ విజయంలో కీ రోల్ పోషించి.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ గెలిచిన జట్టులోనూ అతడు ఆడాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ విధ్వంసకరమైన బ్యాటంగ్ చేయడంతో ఇంగ్లాండ్ సిరీస్ లో అవకాశం లభించింది.
అజిత్ అగార్కర్ క్లారిటీ..
ఇక, శ్రేయస్ అయ్యార్ ఎంపికపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి ఎంపిక కాకపోవడంలో అతడి తప్పేం లేదు.. అలాగే మా తప్పు కూడా ఏమీ లేదన్నారు. అతడు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.. అయినా, ఎవరి స్థానంలో అయ్యర్ ను తీసుకురావాలో మీరే చెప్పండి? అని ప్రెస్ మీట్ లో ప్రశ్నించాడు. తుది జట్టులో 15 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యర్‌ను తీసుకోలేకపోయామని వెల్లడించారు.
మరోవైపు, శ్రేయస్ అయ్యర్‌తో పాటు కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శశంక్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లకు కూడా ఈసారి తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా, యశస్వి జైశ్వాల్, ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ లను స్టాండ్ బై ప్లేయర్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. రాబోయే ఆసియా కప్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్‌లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!