Rahul Gandhi: భారత్ జోడో యాత్ర సమయంలో ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు నిన్న (ఆగస్టు 4న) మందలించింది. రాహుల్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని, అతడు మాట్లాడిన మాటలు సరైనవేనంటూ ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
Operation Akhal: శుక్రవారం జమ్మూ కాశ్మీర్ కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ ‘‘ఆపరేషన్ అఖల్’’లో భాగంగా జరిగింది. ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో అనుబంధంగా ఉన్నారని మరియు ఇటీవలి పహల్గామ్ దాడితో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సైన్యం ముష్కరుల భరతం పడుతోంది. ఒక్కొక్కరిని ఏరివేస్తోంది. ఇటీవల శ్రీనగర్‌లో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల్న హతం చేయడానికి భద్రతా బలగాలు ‘‘ఆపరేషన్ మహదేవ్’’ నిర్వహిస్తోంది. తాజాగా, కుల్గాంలోని అకల్ దేవ్‌సర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. దేగ్వార్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ సమీపంలో ఉగ్రవాదుల అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందిందని భద్రతా దళాలు తెలిపాయి. ఆ తర్వాత భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాల బృందంపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రమూకలపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను హతమయ్యారు. Also…
కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను ప్రధాని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే పీఓకేను భారత్ కోల్పోయింది.. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని మోడీ అన్నారు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. అక్సాయ్ చిన్ కు బదులుగా, మొత్తం ప్రాంతాన్ని 'బంజరు భూమి'గా ప్రకటించారని.. దీని కారణంగా మనం దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవలసి వచ్చిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోడీ ఆరోపించారు. సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మీడియా హెడ్‌లైన్లలో వచ్చేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీంతో ప్రజల మనస్సుల్ని గెలవలేరన్నారు.
Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆ రాష్ట్రంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న హింసనను అడ్డుకుని, శాంతిభద్రతలను పునరుద్ధరించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాష్ట్రంలోని 5 లోయ ప్రాంత జిల్లాల్లో నిర్వహించిన ఆపరేషన్లలో భారత ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Parliament Session: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆపరేషన్‌లో పాక్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది.