UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- రాజకీయ సంక్షోభం దిశగా యూకే!
- కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు
- రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్‌లో కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఎంపీల నుంచి తీవ్ర తిరుగుబాటు ఎదురైంది. అంతకముందు ఎప్స్టీన్ వ్యవహారం కూడా యూకేలో కుదిపేసింది. దీంతో కీర్ స్టార్మర్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఇప్పుడు సొంత కేబినెట్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రక్షణ వ్యవహారాలకు సంబంధించి కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రక్షణ వ్యయాలపై నెలకొన్న తీవ్ర విభేదాల నేపథ్యంలో బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచ భద్రతా పరిస్థితులు వేగంగా దిగజారుతున్నప్పటికీ బ్రిటన్ సైన్యానికి తగిన నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కీర్ స్టార్మర్‌కు రాసిన రాజీనామా లేఖలో హీలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను ఎప్పుడూ రాయాలని అనుకోని లేఖ ఇది.’’ అంటూ ప్రారంభించిన ఆయన.. ‘‘తీవ్ర విచారం.. ఇష్టంలేకుండానే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు. ఇదే విషయంపై స్టార్మర్తో వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
Also Read
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
వివాదానికి కారణమేంటి?
ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. బ్రిటన్ వ్యూహాత్మక రక్షణ సమీక్షలో ప్రతిపాదించిన లక్ష్యాలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల ప్రణాళిక ఇదే. అయితే నెలల తరబడి జరిగిన చర్చల అనంతరం కూడా ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయించేందుకు ముందుకు రాలేదని హీలీ ఆరోపించారు. ముఖ్యంగా ప్రధాని కార్యాలయం, ట్రెజరీ (ఆర్థిక శాఖ) ప్రతిపాదించిన నిధులు దేశ భద్రతా అవసరాలకు ఏమాత్రం సరిపోవని విమర్శించారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం రక్షణ వ్యయం 2030 నాటికి జీడీపీలో 2.68 శాతానికి మాత్రమే చేరుతుందని.. ఇది సరిపోదని హీలీ అభిప్రాయపడ్డారు. ఇక తన లేఖలో హీలీ అత్యంత ఘాటుగా స్పందించిన అంశం రష్యా ముప్పుపై స్టార్మర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడం.
ఇటీవల రష్యా 2030 నాటికి నాటో భూభాగాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని స్టార్మర్ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసిన హీలీ.. అలాంటి ప్రమాదాల గురించి ప్రభుత్వం మాట్లాడుతూనే.. వాటిని ఎదుర్కొనే స్థాయిలో నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ‘‘రక్షణ రంగానికి ఏమి అవసరమో మీకు తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైన పెట్టుబడి ప్రణాళిక లేకుండా నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు సైనికుల సన్నద్ధతను తగ్గిస్తాయి. విధుల్లో ఉన్న సిబ్బందికి ప్రమాదాన్ని పెంచుతాయి.’’ అని లేఖలో పేర్కొన్నారు.
నెలలుగా విభేదాలు
గత కొన్ని నెలలుగా రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, ప్రధాని కార్యాలయం మధ్య నిధుల విషయంలో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక రక్షణ సమీక్షలో ప్రతిపాదించిన లక్ష్యాలకు, అందుబాటులో ఉన్న నిధులకు మధ్య బిలియన్ల పౌండ్ల లోటు ఉందని రక్షణ అధికారులు ఇప్పటికే హెచ్చరించినట్లు సమాచారం. ఈ కారణంగానే డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పలుమార్లు వాయిదా పడింది. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే బ్రిటన్ సైన్యాధిపతి కూడా నేరుగా ప్రధాని స్టార్మర్‌కు లేఖ రాసి రక్షణ రంగానికి కేటాయిస్తున్న నిధులు సరిపోవని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ పరిస్థితుల మధ్య రాజీనామా
జాన్ హీలీ రాజీనామా బ్రిటన్‌కు అత్యంత కీలక సమయంలో చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు మద్దతు, రష్యాపై పెరుగుతున్న ఆందోళనలు, నాటో సభ్య దేశాలపై రక్షణ వ్యయాలను పెంచాలన్న ఒత్తిళ్లు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు వంటి పరిణామాల మధ్య ఈ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక స్టార్మర్ ప్రభుత్వం సైన్యాన్ని బలోపేతం చేస్తామని చెబుతూనే తగిన నిధులు కేటాయించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రాజకీయ సంక్షోభంగా వివాదం
ఇప్పటి వరకు కేవలం విధానపరమైన వివాదంగా కనిపించిన ఈ అంశం.. హీలీ రాజీనామాతో పూర్తిస్థాయి రాజకీయ సంక్షోభంగా మారింది. దీంతో బ్రిటన్ రక్షణ వ్యూహం, జాతీయ భద్రత, సైనిక వ్యయాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామం స్టార్మర్ ప్రభుత్వానికి మరింత రాజకీయ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!