Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి.. కానీ వన్‌సైడ్ లవర్స్ పడే పెయిన్, వారి ఇంటెన్సిటీని చూపించే సినిమాలు ఎప్పుడూ స్పెషలే. ఇప్పుడు సరిగ్గా అదే కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ‘దీవానా’. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఖలై హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ చిత్రాన్ని అత్యంత ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ముఖ్యంగా ట్రైలర్ ప్రారంభంలోనే “వన్‌సైడ్ లవర్స్ అందరికీ అంకితం” అంటూ వేసిన క్యాప్షన్, ప్రతి ఒక్క ప్రేమికుడి హృదయాన్ని టచ్ చేసేలా ఉంది.
ట్రైలర్ చూస్తుంటే సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత రగ్గడ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో స్పష్టమవుతోంది. తన ప్రేయసి ‘అమ్ము’పై ఉన్న పిచ్చి ప్రేమతో ఆమె పేరును గుండెపై టాటూ వేయించుకోవడం, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితులతో సైతం గొడవ పడటం. అమ్ము గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు సహించకపోవడం, ఆ ప్రేమ కోసం కన్న తల్లిదండ్రులను కూడా వదులుకోవడానికి సిద్ధపడటం.. ఇలా హీరో పాత్రలోని ఇంటెన్సిటీ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
హీరో హర్షిత్ రెడ్డి ఈ సినిమాలో కంప్లీట్ మేకోవర్‌తో సరికొత్త రగ్గడ్ లవర్ బాయ్‌గా కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఆయన ఇంటెన్స్ యాక్టింగ్ సినిమాకు ప్రధాన బలంగా మారనుందనిపిస్తోంది. హీరోయిన్ స్మేహ మణిమేఖలై స్క్రీన్ పై చాలా చార్మింగ్ గా, వైబ్రెంట్ గా కనిపిస్తూ యూత్‌ను కట్టిపడేస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాపై అంచనాలను పెంచేసింది. గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం సినిమా రేంజ్‌ను పెంచింది. ఈశ్వర్ చంద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ట్రైలర్‌కు ప్రాణం పోశాయి. సీనియర్ నటులు ఝాన్సీ, నరేష్ కీలక పాత్రల్లో నటిస్తూ సినిమాకు మరింత ఎమోషనల్ వెయిట్ తీసుకొచ్చారు. ఇక ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వెండితెరపై ఈ వన్‌సైడ్ లవర్ చేసే హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి!
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!