Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న భారీ ప్రమాదం నేపథ్యంలో యాజమాన్యం కీలక చర్యలు చేపట్టింది. ప్రమాదం అనంతర పరిణామాల నిర్వహణలో లోపాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు సీనియర్ అధికారులపై బదిలీ వేటు పడింది. ముగ్గురు జనరల్ మేనేజర్లు (GMలు), నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు (DGMలు) బదిలీకి గురయ్యారు. వీరిలో కొందరిని హెచ్ఆర్ (HR), టౌన్షిప్ మెయింటెనెన్స్ వంటి విభాగాల నుంచి ఉత్పత్తి విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమయ్యారనే అభిప్రాయంతోనే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదే విషయంపై కార్మిక సంఘాలు కూడా స్పందించాయి. ప్రమాదం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను అధికారులు సక్రమంగా హ్యాండిల్ చేయలేకపోయారని, అందుకే ఈ బదిలీలు జరిగాయని యూనియన్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, యాజమాన్యం నుంచి ఈ బదిలీలపై అధికారిక వివరణ ఇంకా వెలువడలేదు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదిక, అంతర్గత విచారణ ఫలితాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మరిన్ని పరిపాలనా చర్యలు ఉండే అవకాశముందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఈ పరిణామాలు ఉద్యోగులు, కార్మిక సంఘాలు, పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Also Read
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!