Anant Shastra: పాకిస్తాన్, చైనా సరిహద్ధుల్ని మరింత బలోపేతం చేయడానికి భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో వైమానిక రక్షణ నెట్వర్క్‌ను బలోపేతం చేయడానికి భారత సైన్యం ఐదు నుంచి ఆరు రెజిమెంట్ల ‘‘ అనంత శస్త్ర’’ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేసింది.
Malegaon blasts case: 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ నిర్దోషిగా విడుదలయ్యారు. నిర్దోషిగా విడుదలైన తర్వాత ఆయనకు “కల్నల్”గా ప్రమోషన్ లభించింది. జూలై 1న ప్రత్యేక NIA కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన ఏడుగురు నిందితులలో శ్రీ పురోహిత్ కూడా ఉన్నారు. కేవలం అనుమానం మాత్రమే సాక్ష్యాన్ని భర్తీ చేయదని…
India-Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తా్న్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ సమయంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విమరణకు బ్రతిమిలాడటంతో, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.
Anil Chauhan: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెపోటిజం(బంధుప్రీతి) లేని ఏకైక ప్రదేశం సైన్యం మాత్రమే అని చెప్పారు. దేశానికి సేవ చేయడానికి, వివిధ ప్రాంతాలను అన్వేషించడానికి సాయుధ దళాల్లో చేరాలని పిల్లలను కోరారు. రాంచీలోని పాఠశాల పిల్లలతో మాట్లాడిన ఆయన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల్ని కాపాడేందుకు సాయుధ దళాలు ఈ ఏడాది చాలా ప్రయత్నాలు చేశాయని చెప్పారు. Read Also: Coffee: కాఫీ ప్రియులకు అలర్ట్..…
Terrorist Encounter: జమ్మూ కాశ్మీర్‌లో వాతావరణ విధ్వంసం కారణంగా ప్రతిచోటా జనజీవనం అస్తవ్యస్తమైంది. అకాల వర్షాలతో, అనుకూలంగా లేని వాతావరణాన్ని ఉగ్రవాదులు ఆసరాగా చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వారి ప్రతి ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టర్ పరిధిలోని LOC లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ అధికారులు భగ్నం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్‌గా చేసుకొని సోమవారం ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తుండగా భారత…
ముదావత్ మురళి నాయక్ భారత సైనిక దళానికి చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025 లో పాల్గొన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శత్రువులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. ఇప్పుడు ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా కే సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాని…
Defence Forces In KBC 17: కౌన్ బనేగా కరోడ్పతి (KBC) 17కి హోస్ట్గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ వ్యవహరిస్తున్నారు. అయితే, త్వరలో ప్రసారం కానున్న స్వాతంత్య్ర దినోత్సవ రోజుకు సంబంధించి ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోలో ఆయన దేశ రక్షక వీరులైన భారత రక్షణ దళాల ప్రతినిధులతో కలిసి ముచ్చటించారు.
Rahul Gandhi: భారత్ జోడో యాత్ర సమయంలో ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు నిన్న (ఆగస్టు 4న) మందలించింది. రాహుల్పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని, అతడు మాట్లాడిన మాటలు సరైనవేనంటూ ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
Operation Akhal: శుక్రవారం జమ్మూ కాశ్మీర్ కుల్గామ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ ‘‘ఆపరేషన్ అఖల్’’లో భాగంగా జరిగింది. ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో అనుబంధంగా ఉన్నారని మరియు ఇటీవలి పహల్గామ్ దాడితో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు.