పెహాల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్ గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రధాని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సిందూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోడీని లొంగిపో అన్నారని.. అమెరికా ఒత్తిడి కి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు.
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్‌పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. ఫలితమే ప్రధానం అన్నారు.
మే 31న అంటే శనివారం పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు అధికారులు. భారత్ లో జరగనున్న ఈ మాక్ డ్రిల్ ముందు పాకిస్తాన్‌లో భయానక వాతావరణం నెలకొంది. పాకిస్తాన్‌లోని అన్ని మీడియా ఛానెళ్లలో, ఈ మాక్ డ్రిల్‌ను భారత్ కొత్త చర్యతో ముడిపెడుతున్నారు. పాకిస్తాన్ సైన్యంలోని ప్రముఖ జర్నలిస్టులు, మాజీ అధికారులు అణు దాడి భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. Also Read:GT vs MI IPL 2025 Eliminator: క్వాలిఫయర్-2కి ముంబై.. ఇంటికి గుజరాత్..…
నిన్న జైహింద్ ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ కూడా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరారని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు ఆకాంక్షించారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారన్నారు. పాక్ ఉగ్రవాద స్థావరాలను, పాక్ కీలకమైన సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిన…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైన ఆరోపణలన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాపెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
Sikkim: సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న వాహనం గురువారం రాత్రి తీస్తా నదిలో పడిపోయింది. దాదాపుగా 1000 అడుగుల ఎత్తు నుంచి వాహనం పడిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా, 9 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బీజేపీ లీడర్ ఇతి శ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారు. వాహనం లాచెన్ నుంచి లాంచుంగ్ వెళ్తుండగా వాహనం మలుపు తిరిగే సమయంలో ప్రమాదం జరిగింది.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్‌లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత సైన్యం పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్య గురించి చర్చతో పాటు, ఈ ఆపరేషన్ లోగో రూపకల్పన కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపింది. కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ లోగో ఎవరు రూపొందించి ఉంటారబ్బా అని సెర్చ్ చేయడం ప్రారంభించారు. Also Read:Bhatti Vikramarka: స్వామి ఆశీస్సులతోనే…
NDA: ఆదివారం ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాయుధ దళాల పరాక్రమాన్ని, ప్రధాని నరేంద్రమోడీ ధైర్యమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ప్రీతి జింతా ఒకరు. ఈ అమ్మడు హిందీతో పాటు తెలుగులోను పలువురు సీనియర్ హీరోలతో కలిసి సందడి చేసింది. ప్రజంట్ సినిమాలు కాస్త తగ్గించిన ఈ భామ బిజినెస్‌లతో బిజీ అయింది. అలాగే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సహ యజమాని అయిన ప్రీతి జింతా ఐపీఎల్లో హుషారుగా పాల్గోంటుంది. తన జట్టు మ్యాచులు ఉంటే చాలు.. మైదానంలో ఆమె హాడావుడి మాములుగా ఉండదు. ఇక…