Akash Prime: భారత సైనిక దళాల వైమానిక రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా మరో కీలక విజయాన్ని దేశం సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఆకాశ్ ప్రైమ్’ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను భారత ఆర్మీ లడఖ్‌లో 15,000 అడుగుల ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షలు బుధవారం భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగం ఆధ్వర్యంలో రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (DRDO) సీనియర్ అధికారుల సమక్షంలో నిర్వహించబడ్డాయి. Read Also:Nimisha Priya: నిమిష…
Indian Army: భారతదేశానికి వ్యతిరేకంగా వేర్పాటువాద ఉద్యమం చేస్తున్న నిషేధిత "యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఇండిపెండెంట్)" లేదా "ఉల్ఫా" ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు జరిగాయి. మయన్మార్‌లోని సాగైయాంగ్ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో కీలకమైన ఉల్ఫా ఉగ్రవాదులు మరణించారు. అయితే, ఈ దాడులను భారత సైన్యం జరిపిందని, ఆదివారం ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులతో తమకు సంబంధం లేదని భారత సైన్యం ఖండించింది. అస్సాం…
Apache Helicopter : పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో ఉగ్రవాద గూళ్లపై దాడులకు భారత సైన్యం ముందు నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత సరిహద్దుల్లో రక్షణను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, అత్యాధునిక ఆపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లను భారత్ మోహరించనుంది. ఈ మేరకు ఇప్పటికే అమెరికాతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అమెరికా తయారీ ఆధునిక యుద్ధ హెలికాప్టర్లు ‘అపాచీ AH-64E’లు ఈ నెలలో భారత్‌కు చేరనున్నాయి. మొదటి విడతగా మూడు హెలికాప్టర్లు జూలై…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన రెండు నెలల తర్వాత.. సైన్యం ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసింది. పూంచ్, రాజౌరి జిల్లాల సరిహద్దులోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో చొరబాటుకు ప్రయత్నిస్తుండగా పాక్ జాతీయుడిని అరెస్టు చేసింది. అయితే.. ఈ వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆపరేషన్ సింధూర్ లో భాగమైన రాజీవ్ ఘాయ్‌కు మరో బాధ్యత లభించింది. భారత ప్రభుత్వం ఆయనను డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించింది. దీనితో పాటు, ఆయన భారత DGMOగా కూడా పనిచేస్తారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనతో ధృవీకరించింది. భారత సైన్యం, నిఘా సంస్థతో సహా ఇతర ముఖ్యమైన విభాగాల మధ్య సమన్వయం…
పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ దౌత్య ప్రచారంలో, వాషింగ్టన్ డిసిలో ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. భారత అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, వాషింగ్టన్ పోస్ట్‌లో పనిచేస్తున్న తన కుమారుడు ఇషాన్ థరూర్ ప్రశ్నలు అడిగాడు. వాషింగ్టన్ పోస్ట్ గ్లోబల్ అఫైర్స్ కాలమిస్ట్ ఇషాన్ థరూర్ ఒక ప్రశ్న అడగడానికి లేచి నిలబడగా, థరూర్ నవ్వుతూ, “దీన్ని అనుమతించకూడదు. ఇతను నా కొడుకు”…
Allahabad High Court: 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు (జూన్ 4న) విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది.
పెహాల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్ గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రధాని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సిందూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోడీని లొంగిపో అన్నారని.. అమెరికా ఒత్తిడి కి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు.
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్‌పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. ఫలితమే ప్రధానం అన్నారు.
మే 31న అంటే శనివారం పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు అధికారులు. భారత్ లో జరగనున్న ఈ మాక్ డ్రిల్ ముందు పాకిస్తాన్లో భయానక వాతావరణం నెలకొంది. పాకిస్తాన్‌లోని అన్ని మీడియా ఛానెళ్లలో, ఈ మాక్ డ్రిల్‌ను భారత్ కొత్త చర్యతో ముడిపెడుతున్నారు. పాకిస్తాన్ సైన్యంలోని ప్రముఖ జర్నలిస్టులు, మాజీ అధికారులు అణు దాడి భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. Also Read:GT vs MI IPL 2025 Eliminator: క్వాలిఫయర్-2కి ముంబై.. ఇంటికి గుజరాత్..…