Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parenting Tips: ఒకప్పుడు సాయంత్రం అయిందంటే చాలు.. వీధులన్నీ పిల్లల కేరింతలతో, ఆటపాటలతో సందడిగా ఉండేవి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇళ్లల్లో అడుగుపెడితే నిశ్శబ్దం.. లేదా టీవీలు, స్మార్ట్ఫోన్ల సౌండ్లు. అవును, ప్రస్తుత తరం పిల్లలు యాంత్రికంగా మారిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారు ‘డిజిటల్ రోబోలు’గా మారుతున్నారు. మరోవైపు, వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు తెరుచుకునే సమయం వచ్చేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పునఃప్రారంభాన్ని ఈనెల 12వ తేదీకి బదులు జూన్ 15కి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల పెంపకం పట్ల తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
తల్లిదండ్రులు పిల్లలు స్కూల్స్లో చేర్పించి అంతా వాళ్లే చూసుకుంటారు లే అని చేతులు దులుపుకోవద్దు. ఇంట్లో కనీసం రోజుకు 1-2 గంటలు ఫోన్లు, టీవీలు పూర్తిగా బంద్ చేసి, పిల్లలతో మాట్లాడటానికి కేటాయించండి. సెలవు రోజుల్లో మాల్స్, సినిమా థియేటర్లకు కాకుండా.. పార్కులు, జూ, మ్యూజియంలు లేదా పల్లెటూళ్లకు తీసుకెళ్లండి. ప్రకృతితో వారిని మమేకం చేయండి. మీరు ఫోన్ చూస్తూ పిల్లలను చదువుకోమంటే వారు వినరు. పిల్లల ముందు డిజిటల్ డిటాక్స్ (Digital Detox) పాటించడం తల్లిదండ్రులుగా మీకూ అవసరమే. పిల్లలు భవిష్యత్తు భారత పౌరులు. వారు కేవలం మార్కులు సాధించే యంత్రాలు కాకూడదు; మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులుగా ఎదగాలి. జూన్ 15 నుంచి బడులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. వారి చేతికి ‘స్మార్ట్ ఫోన్’ కాదు, ‘ఆట బంతి’ని కూడా అందిద్దాం.
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
అలా చేయకపోతే పిల్లలకు జరిగేనష్టం ఏంటి?
పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోకపోవడం, రోజంతా స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక వికాసం కూడా దెబ్బతింటుంది. శారీరక సమస్యలు: వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఊబకాయం (Obesity), కంటి సమస్యలు, వెన్నునొప్పి వంటివి వస్తున్నాయి. నలుగురితో కలవడం, పంచుకోవడం (Sharing), స్నేహం చేయడం వంటి సామాజిక నైపుణ్యాలను (Social Skills) పిల్లలు కోల్పోతున్నారు. ఫోన్లలో హింసాత్మక గేములు ఆడటం వల్ల కోపం, మొండితనం, ఏకాగ్రత లోపించడం (ADHD లక్షణాలు) వంటి సమస్యలు పెరుగుతున్నాయి. సొంతంగా ఆలోచించే శక్తి తగ్గి, కేవలం స్క్రీన్ పై కనిపించే సమాచారాన్ని మాత్రమే గ్రహించే రోబోల్లా తయారవుతున్నారు. అందరూ ప్రతి తల్లిదండ్రుల బాధ్యతగా వ్యవహరించి మీ పిల్లల్ని కాపాడుకోండి.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!